Project K: ఇంటర్నేషనల్ వేదికపై జులై 20న ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్..!
ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-కె’ (Project K). ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
- By Gopichand Published Date - 11:22 AM, Fri - 7 July 23
![Project K: ఇంటర్నేషనల్ వేదికపై జులై 20న ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/05/project-k-imresizer.jpeg)
Project K: ప్రభాస్ నటిస్తోన్న మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ప్రాజెక్ట్-కె’ (Project K). ఈ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జులై19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే జులై 20న ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈకార్యక్రమానికి ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొననున్నట్లు సమాచారం.
అమెరికాలో జరగనున్న శాన్‌డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రబృందం పాల్గొననుంది. ఈ ఈవెంట్‌కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా ‘ప్రాజెక్ట్-కె’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. దీనిపై చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. జులై 20 నుంచి 23 వరకు జరగనున్న ఈ ఈవెంట్లో తొలిరోజు ‘ప్రాజెక్ట్-కె’ చిత్రబృందమంతా పాల్గొననుంది.
PROJECT K’ TITLE, TRAILER, RELEASE DATE TO BE UNVEILED AT COMIC CON, USA… Mark the date: 20 July 2023. pic.twitter.com/NGNPnxm2JS
— OTTention (@OTTentiondotcom) July 7, 2023
Also Read: MS Dhoni Birthday: నేడు కెప్టెన్ కూల్ బర్త్ డే.. ధోనీ పేరు మీద ఉన్న రికార్డులు ఇవే..!
దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ దీనికి హాజరుకానున్నారు. ఇక అదే వేదికపై ఈ సినిమా టైటిల్, ట్రైలర్, రిలీజ్ డేట్‌ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి భారీగా వీక్షకులు వస్తారు. అక్కడ ఈ సినిమా వివరాలు ప్రకటించడం నిజంగా గర్వకారణం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే దీని మేకింగ్ వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Prabhas Raja Saab : రాజా సాబ్ ఇక సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చా..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/01/Raja-Saab-Story-Maruthi-Punch-to-IMDb.jpg)
Prabhas Raja Saab : రాజా సాబ్ ఇక సంక్రాంతికే ఫిక్స్ అవ్వొచ్చా..?
ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి (Director Maruthi) డైరెక్ట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అదిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్