Producer Yakkali Ravindra Babu Dies : నిర్మాత యక్కలి రవీంద్ర బాబు మృతి
నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు పొందారు
- By Sudheer Published Date - 08:16 PM, Sat - 11 November 23
టాలీవుడ్ (Tollywood) చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఉదయం చంద్రమోహన్ (Chandramohan) మరణ వార్త నుండి ఇంకా చిత్రసీమ మాట్లాడుకుంటుండగానే మరో విషాదం అందర్నీ షాక్ లో పడేసింది. ప్రముఖ నిర్మాత, శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు యక్కలి రవీంద్రబాబు (Producer Yakkali Ravindra Babu ) (55) మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
We’re now on WhatsApp. Click to Join.
నిర్మాతగా మిత్రులతో కలిసి ‘సొంత ఊరు, గంగపుత్రులు’ వంటి అవార్డు చిత్రాలతో పాటు.. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస’ వంటి చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు పొందారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పుట్టిన రవీంద్రబాబు.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సినిమాపై ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డులు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా సినిమాలు నిర్మించారు. ఈయన మృతి పట్ల చిత్ర ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఒకే రోజు ఇద్దరు ప్రముఖులను చిత్రసీమ కోల్పోవడం ఎంతో బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Congress TV Ads : కాంగ్రెస్ ప్రచారం ఫై ఈసీ కి బిఆర్ఎస్ పిర్యాదు