Tollywood : చంద్రబాబు అరెస్ట్ ఫై నిర్మాత సురేష్ బాబు కామెంట్స్..
తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్‌కు మారే వరకు ఇండస్ట్రీ రాజకీయాలకు దూరంగానే ఉంది. మనలో చాలా మందికి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల పట్ల ఇష్టం , అభిమానం ఉండొవచ్చు
- By Sudheer Published Date - 02:01 PM, Tue - 19 September 23

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అంశం ఇప్పుడు ఏపీలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారింది. 40 ఏళ్ల రాజకీయ వేత్త..14 ఏళ్ల పాటు సీఎం గా బాధ్యత చేపట్టిన వ్యక్తి..ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడ్ని పట్టుకొని..ఓ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారా అంటూ యావత్ తెలుగు ప్రజానీకం రోడ్ల పైకి వచ్చి సంఘీభావం తెలుపుతుంది. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు ఇతర పార్టీల నేతలు సైతం చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. అలాగే పలు బిజినెస్ సంస్థల ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇంతమంది సపోర్ట్ గా నిలుస్తున్నప్పటికి..టాలీవుడ్ పెద్దలు దీనిపై స్పందించకపోవడం ఫై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇండస్ట్రీ లోని కొంతమంది మాత్రమే ఇప్పటివరకు చంద్రబాబు కు సపోర్ట్ గా నిలిచారు. చాలామంది మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు వద్ద ఎంతోలాభపడిన వక్తులు సైతం మౌనంగా ఉండడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు (D Suresh Babu) ఈ అంశంపై చాల సున్నితంగా తన సమాధానాన్ని ఇచ్చారు.
Read Also : Allu Arjun Statue: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ విగ్రహం
“ఒక పరిశ్రమగా మేము ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా మరియు మతాలకు అతీతంగా ఉంటామని చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్‌కు మారే వరకు ఇండస్ట్రీ రాజకీయాలకు దూరంగానే ఉంది. మనలో చాలా మందికి వ్యక్తిగతంగా రాజకీయ పార్టీల పట్ల ఇష్టం , అభిమానం ఉండొవచ్చు, కానీ మొత్తం పరిశ్రమగా ఎల్లప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రా విభజన సమయంలో కూడా సినీ పరిశ్రమ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. సినిమా తీయడానికే సినీ పరిశ్రమ ఉంది. సున్నితమైన, రాజకీయ అంశాలపై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు. “నేను ఓ నాయకుడిని ఇష్టపడవచ్చు మరో నాయకుడిని ఇష్టపడకపోవచ్చు. అది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ సినిమా పరిశ్రమ మొత్తం రాజకీయాలకు అతీతంగా ఉంటుంది’’ అని సురేష్ బాబు అన్నారు.