HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Producer Skn Clears The Air On Recent Controversial Comments

Producer SKN: టాలీవుడ్‌కు 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయ‌డ‌మే నా లక్ష్యం: నిర్మాత ఎస్‌కేఎన్

డ్రాగన్ సినిమా ఈవెంట్‌లో తెలుగు అమ్మాయిల గురించి నేను జోక్ చేస్తూ మాట్లాడిన మాటలను స్టేట్మెంట్ ఇచ్చినట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

  • Author : Gopi Date : 18-02-2025 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Producer SKN
Producer SKN

Producer SKN: ఇటీవల “డ్రాగన్” సినిమా ఈవెంట్ లో తాను తెలుగు హీరోయిన్స్ గురించి సరదాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ (Producer SKN). తాను ఇప్పటిదాకా 8, 9 మంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేశానని, 12, 13 మంది తెలుగు హీరోయిన్స్‌తో పనిచేశానని అన్నారు. ఇంతమంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో తానూ ఒకరని, హీరోయిన్స్‌తో పాటు చిత్ర పరిశ్రమలోని అన్ని క్రాఫ్టుల్లో 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌కేఎన్ తెలిపారు.

ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. డ్రాగన్ సినిమా ఈవెంట్‌లో తెలుగు అమ్మాయిల గురించి నేను జోక్ చేస్తూ మాట్లాడిన మాటలను స్టేట్మెంట్ ఇచ్చినట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తెలుగు అమ్మాయిలతో నేను పనిచేయను, తెలుగు అమ్మాయిలకు అ‌వకాశాలు ఇవ్వొద్దు, తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు అని నేను అన్నట్లు హెడ్డింగ్స్ పెట్టి కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. నేను ఇప్పటిదాకా 8, 9 మంది తెలుగు అమ్మాయిలను (రశ్మి, ఆనంది- ఈ రోజుల్లో, మానస – రొమాన్స్, ప్రియాంక జవాల్కర్ – టాక్సీవాలా, హారిక(సంతోష్ శోభన్ అప్ కమింగ్ మూవీ), ఐశ్వర్య – (అప్ కమింగ్ మూవీ), కుషిత(3 రోజెస్) హీరోయిన్స్ గా పరిచయం చేశాను. ఇషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఇనయా వంటి 12, 13 మంది తెలుగు హీరోయిన్స్‌తో పనిచేశాను. నేను వర్క్ చేసిన వారిలో 80 పర్సెంట్ తెలుగు అమ్మాయిలే అన్నారు.

Also Read: Minister Sridhar Babu: టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు

ఇటీవల కాలంలో ఇంతమంది తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో నేనూ ఒకరిని. హీరోయిన్స్ గానే కాదు డైరెక్షన్, రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్..ఇలా చిత్ర పరిశ్రమలోని అన్ని క్రాఫ్టుల్లో 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. త్వరలోనే ఆ టార్గెట్ రీచ్ అవుతాను. నేను నిర్మించే చిత్రాల్లో హీరోయిన్స్ గా ఫస్ట్ ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే ఇస్తాను. నేను ఇప్పుడు చేస్తున్న మూడు సినిమాల్లో తెలుగు అమ్మాయిలే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రైటర్ గా కూడా తెలుగు అమ్మాయిలనే తీసుకున్నాం. నేను నిర్మించే చిత్రాల్లో హీరోయిన్స్ గా ఫస్ట్ ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే ఇస్తానని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dragon Pre Release Event
  • producer
  • Producer SKN
  • Telugu Heroines
  • telugu movies
  • tollywood
  • tollywood producer

Related News

    Latest News

    • JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

    • NRI TDP : డల్లాస్ లో నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంకు ఘనసత్కారం

    • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

    • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

    • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd