Daaku Maharaj : ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో, ఏపీలో.. ఎప్పుడో తెలుసా?
తాజాగా నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమా గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు.
- By News Desk Published Date - 12:45 PM, Mon - 23 December 24

Daaku Maharaj : బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమా జనవరి 12న సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా భారీగానే తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ అయిపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు.
తాజాగా నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ బాబీ డాకు మహారాజ్ సినిమా గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డాకు మహారాజ్ సినిమా నుంచి నిర్వహించే భారీ ఈవెంట్స్ గురించి మాట్లాడారు. డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జనవరి 2న నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత అమెరికాలో జనవరి 4న భారీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. అనంతరం జనవరి 8న ఏపీలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. అమెరికాలో డల్లాస్ లో నిర్వహిస్తుండగా ఏపీలో ఎక్కడ చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు.
Also Read : Hyderabad CP CV Anand: బౌన్సర్లకు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక.. ఎక్స్‌ట్రాలు చేస్తే తాట తీస్తా!