Pushpa 2 : పుష్ప 2 గొడవలకు ఫుల్ స్టాప్.. పుష్ప షూట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు పుష్ప 2 పై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు.
- By News Desk Published Date - 06:58 PM, Fri - 19 July 24

Pushpa 2 : గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమాపై బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. సుకుమార్(Sukumar) – అల్లు అర్జున్(Allu Arjun) కి గొడవ అయిందని, అల్లు అర్జున్ గడ్డం తీసేశాడని, పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని, డిసెంబర్ రిలీజ్ కూడా కష్టమే అని, సుకుమార్ షూట్ ఆపేసి ఫారెన్ వెళ్లాడని, అల్లు అర్జున్ కూడా వెకేషన్ కి వెళ్లాడని.. ఇలా రకరకాల వార్తలు పుష్ప 2 సినిమా గురించి నెగిటివ్ గా వస్తూనే ఉన్నాయి. మూవీ యూనిట్ ఎవరూ కూడా దీనిపై స్పందించలేదు.
అయితే తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు పుష్ప 2 పై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు. ఆయ్ అనే సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత బన్నీ వాసు పాల్గొనగా మీడియా నుంచి పుష్ప 2 అప్డేట్, సుకుమార్ గొడవల గురించి ప్రశ్నలు వచ్చాయి.
వీటికి బన్నీ వాసు సమాధానమిస్తూ.. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ చదివాను. అవి చూసి నవ్వుకున్నాను. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనుకున్నాను. సినిమాలో ఏం జరుగుతుందో నాకు తెలుసు. పుష్ప 2 షూటింగ్ అల్లు అర్జున్ గారిది కేవలం 15 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఒక క్లైమాక్స్, ఒక పాట షూట్ బ్యాలెన్స్ ఉంది. ఫహద్ ఫాజిల్ షూట్ కొంత బ్యాలెన్స్ ఉంది. ఆయన డేట్స్ దొరకక లేట్ అయింది. ఆ షూట్ గ్యాప్ కి ఇంకా నెల రోజులు టైం ఉంది. ఓ పక్కన ఎడిట్ జరుగుతుంది. సుకుమార్ – అల్లు అర్జున్ కి స్పెషల్ బాండింగ్ అని అందరికి తెలుసు. సుకుమార్ ఇంకా ఆరు నెలలు షూట్ చేసినా అల్లు అర్జున్ వెళ్తాడు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చి పుష్ప 2 పై వచ్చే నెగిటివ్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read : Nani : బలగంపై ప్రేమ.. నాని ఎల్లమ్మ పరిస్థితి ఏంటి..?