Priyanka Mohan : పవన్ కళ్యాణ్ పై OG భామ కామెంట్స్ వైరల్..
ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
- Author : News Desk
Date : 26-02-2024 - 4:16 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళ భామ ప్రియాంక మోహన్(Priyanka Mohan) తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో ఆల్రెడీ నాని సరసన గ్యాంగ్ లీడర్ సినిమాతో మెప్పించింది ఈ భామ. ఇప్పుడు పవన్(Pawan Kalyan) సరసన OG సినిమాతో రాబోతుంది. నాని సరిపోదా శనివారం సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ OG సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న They Call Him OG సినిమా నుంచి ఆల్రెడీ గ్లింప్స్ రిలీజయి భారీ అంచనాలు నెలకొల్పింది.
తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్నారు కదా పవన్ గురించి, OG సినిమా గురించి చెప్పండి అని అడిగాడు.
దీనికి ప్రియాంక మోహన్ సమాధానమిస్తూ.. పవన్ కళ్యాణ్ గారు ఒక లెజెండ్, అమేజింగ్ హ్యూమన్, ఒక గ్రేట్ లీడర్ అని తెలిపింది. OG సినిమా అదిరిపోతుంది, నేను కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పింది. దీంతో ప్రియాంక వ్యాఖ్యలని పవన్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇక OG సినిమా పవన్ కి సంబంధించి కొంత షూట్ పార్ట్ బ్యాలెన్స్ ఉందని, ఎన్నికలు అయ్యాక అది పూర్తి చేస్తారని సమాచారం. సినిమాని మాత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.

Also Read : Premalu : మరో సూపర్ హిట్ మలయాళ ప్రేమకథ చిత్రం తెలుగులో రిలీజ్.. ‘ప్రేమలు’