Bollywood No.1: బాక్సాఫీస్ బాద్ షా ‘పఠాన్’.. బాలీవుడ్ నెం1 గ్రాసర్ గా సరికొత్త రికార్డు!
ఇప్పటిదాకా 511 కోట్లతో పఠాన్ హిందీ సినిమాల్లో తొలి స్థానాన్ని తీసుకున్నాడు.
- By Balu J Published Date - 05:40 PM, Sun - 5 March 23

ఒకప్పుడు ఇండియన్ సినిమాను ఏలిన బాలీవుడ్ సరైన హిట్స్ లేక దుమ్ముపట్టిపోయింది. అమితాబ్, అక్షయ్, అమీర్, సల్మాన్ ఇలా ఎంతమంది స్టార్స్ సినిమాలు రిలీజ్ అయినా అదే పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో నేనున్నా అంటూ ముందుకొచ్చాడు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. దాదాపు ఐదేళ్ల తర్వాత పఠాన్ తో వచ్చిన బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ, థియేటర్లకు కొత్త కళను తీసుకొస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఇప్పటిదాకా 511 కోట్లతో పఠాన్ హిందీ సినిమాల్లో తొలి స్థానాన్ని తీసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉంది. దానికొచ్చిన మొత్తం 510 కోట్లు. ఆ తర్వాతి స్థానాల్లో కెజిఎఫ్ టూ 434 కోట్లు, దంగల్ 374 కోట్లు, సంజు 342 కోట్లతో మిగిలిన టాప్ 4 ప్లేస్ తీసుకున్నాయి. ఒక డబ్బింగ్ చిత్రం టాప్ లో ఉందన్న నార్త్ నిర్మాతల కొరత తీరిపోయింది.
ఇదంత సులభంగా అయితే జరగలేదు. యష్ రాజ్ సంస్థ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఆఫర్లను ప్రకటించింది. మూడు వారాలు దాటాక 112 రూపాయలకే మల్టీ ప్లెక్స్ టికెట్లు అమ్మింది. ఇటీవలే బుక్ మై షో వన్ ప్లస్ వన్ అమలు చేసింది. అంటే ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అన్నమాట. షెహజాదా రిలీజైన రోజే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి స్కీములు పెట్టి జనాన్ని లాగేశారని ట్రేడ్ వాపోయింది. పఠాన్ ఎంత గొప్పగా ఆడినా అది అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్న గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం వెనుకే ఉంది. అయితే హిట్స్ లేక డీలా పడిపోయిన బాలీవుడ్ కు పఠాన్ కొత్త ఊపిరి పోసిందని చెప్పక తప్పదు.

Related News

Covid 19: దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కోవిడ్.. కేంద్ర ప్రభుత్వం అలర్ట్?
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్ కేసుల సంఖ్య అంతకంతకూ