Priyanka Arul Mohan : అందరు ఆ హీరోయిన్ వెంట పడుతున్నారే.. టాలీవుడ్ లో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ..!
Priyanka Arul Mohan టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ పడితే చాలు అదే పనిగా ఆ హీరోయిన్ కి అవకాశాలు వస్తుంటాయి. అయితే ఆల్రెడీ అంతకుముందు
- By Ramesh Published Date - 04:01 PM, Sun - 29 October 23
Priyanka Arul Mohan టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ పడితే చాలు అదే పనిగా ఆ హీరోయిన్ కి అవకాశాలు వస్తుంటాయి. అయితే ఆల్రెడీ అంతకుముందు సినిమాలు చేసి కాస్త వెనక్కు తగ్గినట్టు అనిపించినా వేరే భాషలో క్రేజ్ తెచ్చుకోవడంతో అలాంటి వారికి మళ్లీ తెలుగులో అవకాశాలు అందిస్తారు. ఇలాంటి వారు చాలా అరుదని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆ క్రేజ్ సంపాదించుకుంది చెన్నై చిన్నది ప్రియాంక అరుల్ మోహన్.
నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటించిన ప్రియాంక (Priyanka Mohan) ఆ తర్వాత పెద్దగా ఛాన్స్ లు అందుకోలేదు. అయితే తమిళంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న ప్రియాంకకు పవర్ స్టార్ ఓజీ సినిమాతో లక్కీ ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సినిమా అంటే స్టార్ రేంజ్ వచ్చినట్టే. ఆ సినిమా పూర్తి కాకుండానే మరో మెగా ఛాన్స్ అందుకుంది. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిఓదా శనివారం సినిమాలో ప్రియాంకా నటిస్తుంది.
Also Read : Vikram Thangalaan : తమిళ మేకర్స్ కి ఆ మాత్రం తీరిక లేదా.. ఎందుకిలా చేస్తున్నారు..?
ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్ట్ లు కాగా ఇప్పుడు ఏకంగా మరో ఆఫర్ అందుకుందట అమ్మడు. పవన్, నాని (Nani) సినిమాల తర్వాత అమ్మడు మాస్ మహరాజ్ రవితేజ తో కలిసి జోడీ కట్టబోతుందని టాక్. గోపీచంద్ మలినేని రవితేజ కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రియాంకా హీరోయిన్ గా సెలెక్ట్ అవడం లక్కీ అనే చెప్పొచ్చు. ఈ సినిమాలన్నీ కూడా కచ్చితంగా ప్రియాంకాకు తెలుగులో స్టార్ క్రేజ్ తెస్తాయని చెప్పొచ్చు. పవన్, నాని, రవితేజ (Raviteja) ఈ 3 సినిమాల్లో ఏ ఒకటి రెండు హిట్టైనా ప్రియాంక రేంజ్ మారినట్టే లెక్క.
We’re now on WhatsApp : Click to Join