Priyamani : భయపడతా భయపెడతా.. పెళ్లి తర్వాత అవన్నీ సహజం అనేస్తున్న స్టార్ హీరోయిన్..!
Priyamani బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించిన ప్రియమణి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకబడింది. అయినా సరే అమ్మడికి ఆఫర్లకు కొదవలేదు.
- By Ramesh Published Date - 09:16 AM, Sat - 17 February 24

Priyamani బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించిన ప్రియమణి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకబడింది. అయినా సరే అమ్మడికి ఆఫర్లకు కొదవలేదు. హీరోయిన్ గానే కాదు సపోర్టింగ్ రోల్స్ లో ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ వచ్చింది ప్రియమణి. 2017 లో ముస్తఫా రాజ్ ని పెళ్లాడిన అమ్మడు ఆ తర్వాత కొన్నాళ్లు కెరీర్ గ్యాప్ ఇచ్చింది. అయితే ఈటీవీ ఢీ షో ద్వారా మళ్లీ ఆడియన్స్ కు టచ్ లోకి వచ్చింది. ఆ షో జడ్జిగా చేస్తూ ఇటు సినిమా ఛాన్స్ లు అందుకుంది ప్రియమణి.
వెంకటేష్ తో నారప్ప చేసిన ప్రియమణి రానా విరాట పర్వంలో కూడా మంచి రోల్ చేసింది. నాగ చైతన్య కస్టడీలో కూడా ప్రియమణి నటించిన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత తన భర్తతో గొడవైనట్టు వార్తలు రాగా వాటి గురించి స్పందించింది ప్రియమణి. రీసెంట్ గా ఆహా ఓటీటీలో భామాకలాపం 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రియమణి.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన భర్తతో గొడవలపై స్పందించింది ప్రియమణి. పెళ్లయ్యాక గొడవలు చాలా కామన్. భార్యా భర్తలు గొడవ పడటంలో తప్పులేదు. అంతేకాదు తన భర్తకు తాను కొన్నిసార్లు భయపడతా మరికొన్నిసార్లు భయ పెడతా అని చెప్పింది ప్రియమణి. మొత్తానికి ప్రియమణి భర్తతో గొడవలేమి లేవని తామిద్దరం సంతోషంగా ఉన్నామని చెప్పింది. తెలుగు లో ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా ఎలాంటి పాత్ర అయినా చేసే నటీమణుల్లో ప్రియమణి ఒకరు. అలా కెరీర్ సెట్ చేసుకుంది కాబట్టి ఇప్పటికీ ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి.
Also Read : Rajamouli Mahesh Movie : రాజమౌళి మహేష్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఇన్వెస్ట్మెంట్..?