Salaar 2 : ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..?
ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..? ప్రభాస్ కూడా సెప్టెంబర్ నుంచి..
- By News Desk Published Date - 11:15 AM, Mon - 20 May 24

Salaar 2 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ.. ఫస్ట్ పార్ట్ గత ఏడాది డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం.. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ని ఇవ్వలేదు. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..? అనేది కూడా క్లారిటీ లేదు.
ఇక ఈ సందేహాల మధ్యలో వస్తున్న కొన్ని రూమర్స్.. ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతానికి సలార్ 2ని పక్కన పెట్టేశారని, ఎన్టీఆర్ సినిమా పై ఫోకస్ పెట్టారని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక తాజాగా వచ్చిన ఎన్టీఆర్ సినిమా అప్డేట్‌తో.. ప్రభాస్ అభిమానుల్లో మరింత టెన్షన్ పట్టుకుంది. ఎన్టీఆర్ సినిమాని ఈ ఏడాది ఆగష్టులోనే స్టార్ట్ చేయబోతున్నట్లు మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆగష్టులో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అంటే.. సలార్ 2 షూటింగ్ ఇప్పటిలో లేనట్లే అని తెలుస్తుంది.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారు. జులై వరకు ప్రభాస్.. ఆ సినిమాకే కమిట్ అయ్యి ఉండనున్నారు. కాబట్టి ఈ గ్యాప్ లో ప్రభాస్ కి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరించడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. దీనిబట్టి చూస్తే సలార్ 2 ప్రస్తుతానికి పక్కనే పెట్టేసినట్లు. ప్రభాస్ కూడా సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమా స్టార్ట్ చేయనున్నారని, ఆ తరువాత సందీప్ వంగతో ‘స్పిరిట్’ మొదలు పెట్టనున్నారని సమాచారం.
ఈ మధ్యలోనే ‘రాజాసాబ్’ షూటింగ్ ని కూడా పూర్తీ చేసుకుంటూ వస్తారు. ఈ సినిమాలు అన్ని పూర్తి అవ్వాలంటే.. వచ్చే ఏడాది మధ్య వరకు పడుతుంది. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ సినిమా పూర్తీ చేయాలంటే అంతే సమయం పడుతుంది. ఈ లెక్కలో సలార్ 2 షూటింగ్ పట్టాలు ఎక్కాలంటే.. వచ్చే ఏడాది చివరిలోనే అని తెలుస్తుంది.