Prabhas : ప్రభాస్ కోసం అనుకున్న కథ చరణ్ చేశాడా..?
ఈ సినిమాను మోహన్ కృష్ణ ప్రభాస్ కోసం ఆ కథ రాసుకున్నాడట. కానీ ప్రభాస్ తో కుదరకపోవడంతో జయం రవితో ఆ సినిమా తీశాడు. ఆ సినిమాలో అరవింద స్వామి
- By Ramesh Published Date - 10:08 AM, Mon - 2 September 24

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ బాహుబలికి ముందు ఒక తమిళ దర్శకుడు అతనితో సిన్మా చేయాలని అనుకున్నాడట. ఐతే కాలం కలిసి రాక ఆ సినిమా ప్రభాస్ తో చేయడం కుదరలేదు. ఆ సినిమా తమిళంలో ఒక హీరో చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఆ సినిమాను తెలుగులో చరణ్ చేసి హిట్ కొట్టాడు. ప్రభాస్ (Prabhas) తో చేయాలనుకున్న సినిమా కోలీవుడ్ లో తీసి దాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయడం అక్కడ హిట్ కొట్టడం విశేషం.
ఇంతకీ అది ఏ సినిమా అంటే చరణ్ ధృవ అని తెలుస్తుంది. మోహన్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన తని ఒరువన్ (Thani Oruvan) రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఐతే ఈ సినిమాను మోహన్ కృష్ణ ప్రభాస్ కోసం ఆ కథ రాసుకున్నాడట. కానీ ప్రభాస్ తో కుదరకపోవడంతో జయం రవితో ఆ సినిమా తీశాడు. ఆ సినిమాలో అరవింద స్వామి స్టైలిష్ విలనిజం ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.
ఐతే తని ఒరువన్ హిట్ అవ్వగానే ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని ధృవగా రీమేక్ చేశారు. చరణ్ (Ram Charan) కెరీర్ లో మంచి హిట్ సినిమాగా ధృవ నిలిచింది. ఐతే తెలుగులో ఆ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. అలా ప్రభాస్ తో చేయాలని అనుకున్న కథ కాస్త చరణ్ చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే 300 నుంచి 500 కోట్ల మాట అన్నట్టే. ఆ రేంజ్ కథ అందుకు తగిన బడ్జెట్ ఉంటేనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
తమిళంలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ కృష్ణ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమా తీశారు. ఐతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేదని తెలిసిందే.
Also Read : Indrasena Reddy vs Samara Simha Reddy : ఇంద్రసేనా రెడ్డి vs సమర సింహా రెడ్డి.. రెడీ అంటే రెడీ..!