Manchu Vishnu Kannappa : ప్రభాస్ శివుడు.. నయనతార పార్వతి..!
Manchu Vishnu Kannappa ప్రభాస్ నయనతార కలిసి వి వి వినాయక్ డైరెక్షన్ లో యోగి సినిమాలో నటించారు. ఆ సినిమా వచ్చి 16
- Author : Ramesh
Date : 23-09-2023 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
Manchu Vishnu Kannappa ప్రభాస్ నయనతార కలిసి వి వి వినాయక్ డైరెక్షన్ లో యోగి సినిమాలో నటించారు. ఆ సినిమా వచ్చి 16 ఏళ్ల దాకా అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ నయనతార కలిసి నటించింది లేదు. ప్రభాస్ ఆదిపురుష్ లో రాముడిగా చేస్తే అందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. నయనతార శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు మళ్లీ ప్రభాస్, నయనతార ఇద్దరు కలిసి శివ పాత్రతులుగా నటిస్తారని టాక్.
ఇంతకీ ఏ సినీమలో ఈ ఇద్దరు కలిసి నటిస్తారు అంటే. మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో నటిస్తారని టాక్. మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా ఉంటాడని హింట్ ఇచ్చాడు మంచు విష్ణు. ఈ క్రమంలో ప్రభాస్ ఈ Manchu Vishnu Kannappa సినిమాలో శివుడుగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు.
ఇక పార్వతిగా నయనతార ని తీసుకోవాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. తెలుగులో కూడా తన దాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ ఇక్కడ ప్రేక్షకులకు కూడా అలరిస్తుంది నయనతార. ఇప్పుడు పార్వతి పాత్రకు కూడా ఆమె ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. శివ పార్వతులుగా ప్రభాస్ నయనతార నటిస్తే మంచు విష్ణు కన్నప్ప రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
ఈ సినిమాలో సెట్స్ మీద కు వెళ్లకముందే హీరోయిన్ ఎగ్జిట్ అయ్యింది. వేరే కమిట్మెంట్ ల వల్ల నుపుర్ సనన్ సినిమా నుంచి బయటకు వెళ్లింది. ఇప్పుడు చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే.
Also Read : Bigg Boss 7 : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దామిని వీడియో.. నాగ్ ఏమంటాడో..?