Prabhas : సలార్ అర్ధరాత్రి 1 గంటకి షో..!
ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ ఈ కాంబో అంటే ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. ఆ అంచనాలకు ఏమాత్రం
- By Ramesh Published Date - 07:19 PM, Sat - 16 December 23
ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ ఈ కాంబో అంటే ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సలార్ వస్తుంది. టీజర్, ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన ప్రశాంత్ నీల్ సినిమా ప్లానింగ్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సమైన బజ్ ఏర్పడింది.
తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే సలార్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కూడా మొదటి ఆట చూడాలని ఉత్సాహపడుతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
అయితే హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో అర్ధరాత్రి 1 గంటకు సలార్ షో వేస్తున్నారట. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇదే మొదటి షో అని టాక్. యూఎస్ లో కన్నా శ్రీరాములు థియేటర్ లోనే ఫస్ట్ షో పడుతుందని అంటున్నారు. అర్ధరాత్రి షో కి రెబల్ స్టార్ ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ షో అదే కాబట్టి టికెట్ రేటు కూడా భారీగానే ఉంటుందని చెప్పొచ్చు.
Also Read : Adivi Sesh : శేష్ Ex శృతి.. హీరోయిన్ వచ్చేసింది..!
We’re now on WhatsApp : Click to Join
Related News
Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!
సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుందట. ఆ సిరీస్ ఎండింగ్ తోనే మూవీ స్టార్ట్ కానుందట.