Adivi Sesh : శేష్ Ex శృతి.. హీరోయిన్ వచ్చేసింది..!
ప్రభాస్ తో సలార్ లో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు అడివి శేష్ (Adivi Sesh)
- By Ramesh Published Date - 07:15 PM, Sat - 16 December 23

తెలుగులో మళ్లీ స్టార్ తనయురాలు శృతి హాసన్ బిజీ అవుతుంది. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ లో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ నాని నటించిన హాయ్ నాన్న సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు అడివి శేష్ (Adivi Sesh) చేస్తున్న నెక్స్ట్ సినిమాలో కూడా భాగం అవుతుంది. శేష్ ఎక్స్ శృతి అంటూ ఒక సినిమా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాలో అడివి శేష్ తో శృతి హాసన్ జత కడుతుంది.
రీసెంట్ గా శేష్ ఎక్స్ శృతి అంటూ అడివి శేష్ మాస్క్ ఉన్న పోస్టర్ వదిలారు. ఇక లేటెస్ట్ గా శృతి హాసన్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఇద్దరిలో మాస్క్ అయితే కామన్ గా ఉంది. అడివి శేష్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. సెలెక్టెడ్ గా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ అడివి శేష్ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు.
శేష్ ఎక్స్ శృతి సినిమా టైటిల్ అనుకోగా అసలైన టైటిల్ డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. మొత్తానికి అడివి శేష్ తో శృతి హాసన్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. కొన్నాళ్లు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోని శృతి హాసన్ మళ్లీ ఇక్కడ బిజీ అవుతుంది. ఈ సినిమాను షానియెల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సుప్రియ యార్లగడ్డ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
Also Read : Nani : అక్కడ నాని దూకుడు ఆగేలా లేదు.. హాయ్ నాన్న మరో రికార్డ్..!
We’re now on WhatsApp : Click to Join