HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Prabhas Said Iam Interested Marriage But

Prabhas Reaction: కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. కానీ!

హీరో ప్రభాస్ (Prabhas) తన పెళ్లివార్తపై రియాక్ట్ అయ్యాడు. బాలయ్య అడిగిన ప్రశ్నకు ఫన్నీ సమాధానమిచ్చారు

  • By Balu J Updated On - 04:42 PM, Fri - 30 December 22
Prabhas Reaction: కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. కానీ!

టాలీవుడ్ (Tollywood) లో మోస్ట్ బ్యాచిలర్ అనగానే అందరికీ వెంటనే గుర్తుకువచ్చే పేరు ప్రభాస్ (Prabhas). టాలీవుడ్ రానా, చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ పెళ్లి చేసుకున్నా.. ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్లి చేకోకపోవడంతో పెళ్లి వార్తలపై నేటికీ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాాజాగా తన పెళ్లిపై మరోసారి స్పందించాడు ప్రభాస్ (Prabhas). తను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ ఎప్పుడనేది తనకు కూడా తెలియదంటున్నాడు. రాసి పెట్టి ఉంటే తన పెళ్లి కచ్చితంగా జరుగుతుందంటున్నాడు. బాలయ్య చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్-2కు ప్రత్యేక అతిథిగా వెళ్లాడు ప్రభాస్. షో ప్రారంభంలోనే పెళ్లిపై అడిగేశాడు బాలయ్య. దీంతో కాసేపు తటపటాయించిన ప్రభాస్, నుదిటిపై రాసిపెట్టి ఉంటే జరుగుతుంది అన్నట్టు సింబాలిక్ గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.

ఆమధ్య బాలయ్య షోకు శర్వానంద్ వచ్చాడు. ప్రభాస్ పెళ్లి (Marriage) చేసుకున్న తర్వాత తను చేసుకుంటానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇదేవిషయాన్ని ప్రభాస్ దగ్గర ప్రస్తావిస్తే, తను సల్మాన్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. పెళ్లికి తను వ్యతిరేకం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు ప్రభాస్ (Prabhas). ఇంటిలో తన పెళ్లి పై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుందని, సోదరి, వదిన సహకారంతో ఆ చర్చల నుంచి తప్పించుకుంటానని తెలిపాడు ప్రభాస్.

ప్రభాస్ మంచి నటుడే కాదు.. స్నేహితుడు కూడా.  వర్షం సినిమాతో ప్రభాస్ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.  డైరెక్టర్ శోభన్ ఫ్యామిలీకే కాదు.. ఆ సినిమాలో విలన్‌గా నటించిన హీరో గోపీచంద్‌తో ఇప్పటికీ ప్రభాస్ తన ఫ్రెండ్‌షిప్‌ని కొనసాగిస్తున్నాడు. ఈ అన్‌స్టాపబుల్‌ షోకి ప్రభాస్‌తో కలిసి గోపీచంద్ కూడా వచ్చి సందడి చేశాడు. ఈ షోలో వర్షం సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ ఓ ప్రశ్నని ప్రభాస్ అడిగారు. ‘‘శోభన్ కుమారుడు సంతోష్ శోభన్‌ని నువ్వే దగ్గరకు తీసుకుని.. ట్రైన్ చేసి.. గైడ్‌గా ఉండి.. అతనితో సినిమాలు తీశావు కదా?’’ అని ప్రశ్నించారు. దానికి ప్రభాస్ మాత్రం ‘‘అంత ఏమీ చేయలేదు సార్. కానీ కాస్త సపోర్ట్ అందిచానంతే. ఆడిషన్స్‌కి వచ్చినప్పుడు కలిసి సపోర్ట్ చేశామంతే’’ అని చాలా ఒద్దికగా సమాధానం చెప్పాడు. దాంతో బాలయ్య నీ గొప్ప మనసుకి ఇదే నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్, బాలయ్య షో ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Also Read : Trisha 39: త్రిష తగ్గేదేలే.. నేటికీ అదే అందం, అదే ఫిగర్!

Telegram Channel

Tags  

  • clarity
  • marriage
  • prabhas
  • Unstoppable 2

Related News

NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

NBK- PSPK: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య ప్రశ్న.. ప్రోమో వైరల్!

ఒటీటీ హిస్టరీలోనే ఇప్పుడు మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ లో భాగంగా రాబోతుంది. పవన్ కళ్యాణ్ కంటెంట్ ని రెండు ఎపిసోడ్స్ గా ఆహా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేసింది.

  • Nandamuri Balakrishna: ANRను అవమానించలేదు.. అవన్నీ యాదృచ్చికంగా వచ్చిన మాటలే!

    Nandamuri Balakrishna: ANRను అవమానించలేదు.. అవన్నీ యాదృచ్చికంగా వచ్చిన మాటలే!

  • Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

    Bride Video: మెట్రో ట్రైన్ ఎక్కిన ‘కొత్త పెళ్లి కూతురు’.. చక్కర్లు కొడుతున్న వీడియో!

  • Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరో 150 రోజుల్లో..!

    Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరో 150 రోజుల్లో..!

  • Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’

    Honey Rose: టాలీవుడ్ రోజ్ ‘హనీ రోజ్’

Latest News

  • Who Is Raja Chari: భారత సంతతికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి.. ఎవరీ రాజా జె చారి..?

  • Taliban Bans: మహిళలపై మరో నిషేధం విధించిన తాలిబన్లు.. ఈసారి ఏంటంటే..?

  • Bachula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ

  • Migraines : మైగ్రేన్ తో డెంటల్ ప్రాబ్లమ్స్ కు లింక్ ఉందా?

  • IND vs NZ: నేడే రెండో టీ20.. టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: