Radha Krishna : ప్రభాస్ రాధేశ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ సోదరుడి మృతి.. ఎమోషనల్ పోస్ట్..
తాజాగా తన సోదరుడు చనిపోయాడని ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు రాధాకృష్ణ.
- Author : News Desk
Date : 30-06-2024 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
Radha Krishna : గోపీచంద్ జిల్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ. గతంలో పలు సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన రాధాకృష్ణ గోపీచంద్ జిల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాని అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఆ సినిమా పరాజయం పాలయింది. ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోయినా రాధాకృష్ణ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటాడు.
తాజాగా తన సోదరుడు చనిపోయాడని ఓ ఎమోషనల్ పోస్ట్ చేసాడు రాధాకృష్ణ. తన సోషల్ మీడియాలో సోదరుని ఫోటో షేర్ చేసి.. చావు ఒక్కటే నీ జ్ఞాపకాలని తుడిచిపెడుతుంది. జీవితంలో వినయంగా ఉండేలా నేర్పించినందుకు ధన్యవాదాలు కేదారి శ్రీనివాస్. నీ తమ్ముడిగా ఎప్పటికి సంతోషంగా ఉంటాను. నువ్వు నా మెంటర్ వి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.
రాధాకృష్ణ అన్న శ్రీనివాస్ ఇటీవల చనిపోయినట్టు సమాచారం. తన అన్న జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ రాధాకృష్ణ నిన్న రాత్రి ఈ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు రాధాకృష్ణ అన్నయ్యకు సంతాపం తెలుపుతున్నారు.
Also Read : Bachhala Malli Glimpse : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ గ్లింప్స్ రిలీజ్.. ఎవడి కోసం తగ్గాలి? ఎందుకు తగ్గాలి?