Prabhas Raaja Saab : ముగ్గురు భామలతో రెబల్ స్టార్ హంగామా.. ఫ్యాన్స్ కి పండుగే..!
Prabhas Raaja Saab ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ కలిసి ఒక సాంగ్ చేస్తాడని టాక్. ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా
- By Ramesh Published Date - 12:46 AM, Tue - 30 April 24

Prabhas Raaja Saab మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న రాజా సాబ్ సినిమా 70 శాతం వరకు షూటింగ్ పూర్తైనట్టు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోగా నటిస్తుంది. సినిమాలో మాళవికతో పాటుగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా భాగం అవుతుంది. వీరిద్దరితో పాటు రిధి కుమార్ కూడా రాజా సాబ్ లో నటిస్తుంది.
అయితే సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ కలిసి ఒక సాంగ్ చేస్తాడని టాక్. ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. థమన్ ఇప్పటికే ఈ సాంగ్ కంపోజ్ చేసినట్టు చెబుతున్నారు. మాళవిక, నిధి, రిధి ముగ్గురితో కలిసి ప్రభాస్ మస్త్ జబర్దస్త్ మాస్ డ్యాన్స్ చేస్తాడని తెలుస్తుంది.
రాజా సాబ్ సినిమా వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేసేలా ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే కమర్షియల్ అంశాలు ఉంటాయని చెబుతున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ త్వరలో రిలీజ్ కాబోతుందని టాక్.
కల్కి సినిమా జూన్ 27కి వాయిదా పడింది. సో ఈ లెక్కన చూస్తే ప్రభాస్ రాజా సాబ్ 2025 సంక్రాంతికి పక్కా రిలీజ్ ఉంటుందని చెప్పొచ్చు. ఈసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంక్రాంతి రేసులో ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.
Also Read : Pooja Hegde : ఆఫర్లు లేకపోయినా తగ్గేదేలేదు అంటున్న పూజా హెగ్దే..!