Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ కి పవన్ కళ్యాణ్ టైమ్ ఇచ్చాడా.. హరీష్ శంకర్ సూపర్ హ్యాపీ..!
Pawan Kalyan హరీష్ శంకర్ ఇన్నాళ్లు వెయిట్ చేయగా త్వరలోనే సినిమా షూటింగ్ కు ఓకే చెప్పాడట పవన్ కళ్యాణ్. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతుందని తెలుస్తుంది.
- By Ramesh Published Date - 09:16 PM, Wed - 6 November 24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల గురించి అసలు పట్టించుకోవట్లేదని సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఐతే ఈమధ్యనే ఓజీకి కొంత టైం, హరి హర వీరమల్లు సినిమాకు కొంత టైం ఇచ్చిన పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే ఉస్తాద్ భగత్ సింగ్ ని మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు.
హరీష్ శంకర్ (Harish Shankar) ఈ గ్యాప్ లో రవితేజ (Raviteja)తో మిస్టర్ బచ్చన్ సినిమా కూడా చేశాడు. ఐతే ఆ సినిమా ఫెయిల్యూర్ అయ్యింది. ఈ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయినట్టు చెప్పుకొచ్చారు. ఐతే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh) నుంచి ఆమధ్య వచ్చిన టీజర్స్ ఫ్యాన్స్ ని అలరించాయి. ఐతే సినిమా ఆగిపోయిందన్న వార్తలకు చెక్ పెడుతూ త్వరలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు రెడీ అవుతున్నాడట.
త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్..
హరీష్ శంకర్ ఇన్నాళ్లు వెయిట్ చేయగా త్వరలోనే సినిమా షూటింగ్ కు ఓకే చెప్పాడట పవన్ కళ్యాణ్. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఐతే హరీష్ శంకర్ మాత్రం పవన్ రాక కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ సినిమా తెరి కి రీమేక్ గా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రైటర్ దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.