Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!
సినిమా రిలీజ్ కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుందట. ఆ సిరీస్ ఎండింగ్ తోనే మూవీ స్టార్ట్ కానుందట.
- By News Desk Published Date - 09:46 AM, Wed - 15 May 24
![Kalki 2898 AD : సినిమా రిలీజ్ కంటే ముందే.. కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ రిలీజ్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/Prabhas-Kalki-2898-AD-is-come-with-animated-web-series-before-movie-release.jpg)
Kalki 2898 AD : ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా జూన్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కంటే ముందే కల్కి యానిమేషన్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుందట. ఈ యానిమేషన్ సిరీస్ కి మూవీకి కనెక్షన్ ఉంటుందట.
కల్కి సినిమా కథకి సంబంధించిన ముందు కథని ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ తో మేకర్స్ ఆడియన్స్ కి చెప్పబోతున్నారట. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ తో ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ఎండింగ్.. కల్కి మూవీకి బిగినింగ్ అంట. కాబట్టి సినిమా స్టార్టింగ్ అర్థంకావాలంటే.. ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడాలసిందే. ఈ వెబ్ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేయనున్నారట. మే 25 తరువాత ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ ప్రసారం చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 20 నిముషాలు పైనే ఉంటుందట. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ టీజర్ ఏమో 1 నిమిషం 12 సెకన్స్ తో ఆడియన్స్ ముందుకు రానుందట. మరి ఈ టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఈ వెబ్ సిరీస్ తో పాటు మూవీ నుంచి ఒక సాంగ్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ కూడా కనిపించబోతున్నారు. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Also read : Rakhi Sawant: తీవ్ర గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిన రాఖీ సావంత్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Prabhas Kalki : కల్కి అతని వల్లే పెద్ద హిట్..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/ashwini-dutt-kalki.jpg)
Prabhas Kalki : కల్కి అతని వల్లే పెద్ద హిట్..!
Prabhas Kalki ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటుగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ కి ఎంత మాస్ ఇమేజ్ ఉన్నా సరే బాలీవుడ్ లో