Prabhas Injured : మూవీ షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్
Prabhas Injured : తన చీలమండలో ఏర్పడిన బెణుకు కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభాస్ తెలిపారు.
- By Sudheer Published Date - 02:40 PM, Mon - 16 December 24

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన కొత్త సినిమా షూటింగ్లో గాయపడ్డారు(Prabhas Injured). ఈ గాయం కారణంగా జపాన్‌లో డిసెంబర్ 3న విడుదల కానున్న కల్కి (Kalki) సినిమా ప్రమోషన్లకు తాను హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. తన చీలమండలో ఏర్పడిన బెణుకు కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రభాస్ తెలిపారు. కల్కి ప్రమోషన్లలో డిస్ట్రిబ్యూటర్ల టీమ్ పాల్గొంటుందని చెప్పిన ఆయన, అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో అతడి త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
ప్రభాస్ గాయపడినప్పటికీ ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన కల్కి సినిమాకు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ జపాన్ లో కూడా పెద్ద స్థాయిలో విడుదల అవుతుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ గాయం కొంతమంది అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. అయితే ఆయన త్వరగా కోలుకుని షూటింగ్‌లకు తిరిగి వస్తారని ఆశిస్తున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ప్రభాస్ ఆరోగ్యంపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలంటూ మద్దతు తెలుపుతున్నారు. టాలీవుడ్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన స్టార్‌గా ప్రభాస్ నిలిచారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ , కల్కి 2 , స్పిరిట్ తో పాటు పలు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు.
【緊急のお知らせ】
この度、12/18(水)に主演を務める
プラバースの初来日を予定しておりましたが、
撮影中の捻挫により、
来日が中止となりました。※ナーグ・アシュウィン監督は来日予定であり、
12/18(水)のジャパンプレミアは
予定通り行います。▼プラバース本人から皆さまへメッセージ pic.twitter.com/vLfXHevkoF
— 【公式】映画『カルキ 2898-AD』 (@kalki2898AD_jp) December 16, 2024
Read Also : Breast Cancer in Men : పురుషులుకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం..