Prabhas : కల్కి టీంకి ప్రభాస్ భారీ బహుమతులు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
కల్కి మూవీ టీంకి ప్రభాస్ భారీ బహుమతులు అందించారట. మూడు సంవత్సరాలు పాటు సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి బ్యాంకు డీటెయిల్స్ ని సేకరించి..
- By News Desk Published Date - 05:57 PM, Wed - 10 July 24

Prabhas : టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా హీరోగా అగ్రస్థాయికి ఎదిగినా, ఇప్పటికే ఒదిగే ఉంటారు. తన తోటి నటీనటులతో పాటు సినిమా కోసం పని చేసే ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్టుని, టెక్నీషియని గౌరవం చూస్తుంటారు. అంతేకాదు, వారు చేసే పనిని గుర్తిస్తూ అప్పుడప్పుడు బహుమతులు కూడా ఇస్తుంటారు. అలా కల్కి మూవీ టీంకి కూడా భారీ బహుమతులు అందించారట. ఈ విషయాన్ని కల్కి టీంలో వర్క్ చేసిన ఓ వ్యక్తి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇటీవల రిలీజైన కల్కి బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. దీంతో మూవీ టీం అంతా ఫుల్ జోష్ ఉంది. కాగా ఈ మూవీ టీంలో పని చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కి ప్రభాస్ భారీ మొత్తంలో నగదు బహుమతి ఇచ్చారట. మూడు సంవత్సరాలు పాటు సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరి బ్యాంకు డీటెయిల్స్ ని సేకరించి, వారి అకౌంట్స్ లో దాదాపు రూ.10,000లు వేసారట. సినిమా కోసం వేలల్లో పని చేసారు. వారందరికీ పదివేలు చొప్పున అంటే మాములు విషయం కాదు. ఇక ఈ విషయం బయటికి రావడంతో, అమౌంట్ తెలుసుకొని నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
Great gesture by #Prabhas ❤️#Prabhas distributed some funds to the entire team involved in the making of #Kalki2898AD.👏pic.twitter.com/5aJbwPzYao
— Filmy Bowl (@FilmyBowl) July 9, 2024
ఇక కల్కి కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్ గా 900 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ఇండియన్ బిగ్గెస్ట్ హిట్స్ లో చేరేందుకు పరుగులు పెడుతుంది. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ చిత్రం ఇప్పటివరకు 16.2 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. మరి మొదటి వారం పూర్తి చేసుకొనే సమయానికి ఎంతటి కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి. జవాన్, పఠాన్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డుల్లో దేనిని కల్కి బ్రేక్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు