Prabhas: ప్రభాస్ న్యూ లుక్ వైరల్..!
'బాహుబలి' వంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' వంటి వరుస ఫ్లాప్‌లతో ప్రభాస్ (Prabhas) నిరాశపరిచాడు. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రభాస్ (Prabhas).
- By Gopichand Published Date - 11:30 AM, Sun - 25 December 22
‘బాహుబలి’ వంటి ఇండస్ట్రీ హిట్ల తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వరుస ఫ్లాప్‌లతో ప్రభాస్ (Prabhas) నిరాశపరిచాడు. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మారుతి దర్శకత్వంలో హారర్ డ్రామా. చిత్ర యూనిట్ ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఎలాంటి హంగామా లేకుండా లో ప్రొఫైల్‌లో చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ సెట్ లో ఉన్న ప్రభాస్ ఫోటో ఒకటి లీక్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. లీకైన ఫోటోలో ప్రభాస్ , మారుతి పక్క పక్కనే కూర్చున్నారు. దర్శకుడు మారుతీ మాటలు వింటున్న ప్రభాస్ సెట్స్‌లో తన కుర్చీలో రిలాక్స్‌గా కూర్చున్నట్లు కనిపిస్తుంది. పలు హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన నటి రామేశ్వరి కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. నిజం మూవీలో మహేష్ బాబు తల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. రాధే శ్యామ్‌లో నటించిన రిద్ధి కుమార్‌కి ఈ సినిమాలోనూ మంచి పాత్ర దక్కింది.
Also Read: Bobby Deol: ‘హరి హర వీర మల్లు’ కోసం ఔరంగజేబు వచ్చేశాడు!
ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉంది. దీనిపై వింటేజ్ ప్రభాస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచారు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం పనిచేయని ఓ పాత థియేటర్ చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బహుభాషాల్లో విడుదల కానుంది. ప్రస్తుతం 15 చిత్రాలకు పైగా నిర్మాణంలో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మాణం చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ మూవీల్లో నటిస్తున్నారు.
Related News
Kalki 2898 AD : కల్కి షూటింగ్ అప్డేట్.. రెండో పార్ట్‌కి కనెక్ట్ చేసే సీన్స్‌ని..
షూటింగ్ అయిపోయిందని చెప్పిన కల్కి మూవీ మేకర్స్.. ఇంకా ఏం షూట్ చేస్తున్నారు. కల్కి షూటింగ్ అప్డేట్..