HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Prabhas Birthday Wishes To Vinayak

Happy Birthday Vinayak : వినాయక్ ఇంటికి వెళ్లి విషెష్ తెలిపిన యోగి..

Happy Birthday Vinayak : మాస్ చిత్రాలను తెరకెక్కించడం లో వినాయక్ దిట్ట. ఆయన సినిమాల్లో గాల్లోకి లేచిన సుమోలు, బాంబు పేలుళ్ళు గుర్తుకు వస్తాయి

  • Author : Sudheer Date : 09-10-2024 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prabhas Vinayak
Prabhas Vinayak

మాస్ డైరెక్టర్ వినాయక్ (VV Vinayak) పుట్టిన రోజు (Birthday) ఈరోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు , సినీ లవర్స్ , అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేస్తూ తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. వినాయక్ అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. మాస్ చిత్రాలను తెరకెక్కించడం లో వినాయక్ దిట్ట. ఆయన సినిమాల్లో గాల్లోకి లేచిన సుమోలు, బాంబు పేలుళ్ళు గుర్తుకు వస్తాయి. ప్రతి అంశాన్ని కమర్షియల్ యాంగిల్‌లో చూసి ఆయన సన్నివేశాలను చిత్రీకరించిన తీరూ గుర్తుకు రాకమానదు. తొలి చిత్రం ‘ఆది’ మొదలు మొన్నటి ‘ఛత్రపతి ‘ (హిందీ) వరకు వినాయక్ సినిమాలను పరిశీలిస్తే, ఎలాంటి కథకైనా తనదైన కమర్షియల్ తళుకులు అద్ది, జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ పయనంలో అదరహో అనిపించిన అపూర్వ విజయాలూ ఉన్నాయి. ఉస్సూరుమనిపించిన చిత్రాలూ లేకపోలేదు.

చిరంజీవి , ఎన్టీఆర్ , రవితేజ , ప్రభాస్, అల్లు అర్జున్ , చరణ్ ఇలా ఎంతో మంది అగ్ర హీరోలతో సినిమాలు చేసి తన మార్క్ చూపించారు. కాగా గత కొంతకాలంగా సినిమాలు చేయడం తగ్గించిన ఈయన..ఆ మధ్య ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఘోర ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత ఎలాంటి సినిమా ప్రకటన చేయలేదు. ఇదే క్రమంలో ఆయన బాగా చిక్కిపోయినట్లుగా ఉన్న ఆయన లుక్ బాగా వైరల్ అయ్యింది. వినాయక్ కు ఏమైంది..? ఏమైనా అనారోగ్య సమస్యా అంటూ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వినాయక్‌కి మేజర్ లివర్ సర్జరీ జరిగిందని.. ఆ మధ్య వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఆరోగ్యానికి సంబంధించి కానీ పిక్స్ కానీ బయటకు రాలేదు.

ఇక ఈరోజు ఆయన బర్త్ డే సందర్బంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..స్వయంగా వినాయక్ ఇంటికి వెళ్లి విషెష్ తెలిపారు. గతంలో వీరిద్దరి కలయికలో యోగి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంత విజయం దక్కకపోయినా ప్రభాస్..మాత్రం వినాయక్ తో ఉన్న స్నేహాన్ని వదులుకోలేదు. ప్రభాస్ దృష్టిలో హిట్ , ప్లాప్ అనేది అస్సలు పట్టించుకోడు. ఒక్కసారి కనెక్ట్ అయితే ఎప్పటికి సన్నిహితంగా ఉంటాడు. వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ లో టచ్ లో ఉండడం , లేదా కలవడం వంటివి చేస్తుంటాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రభాస్ ఎంతో బిజీ గా ఉన్నారు. రాజాసాబ్, కల్కి 2 , సలార్ 2 , స్పిరిట్ ఇలా పలు సినిమాలు లైన్లో పెట్టాడు.

Read Also : Zakir Naik: పెళ్లి కానీ ఆడవాళ్లు..పబ్లిక్ ప్రొపర్టీ: జకీర్ నాయక్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Happy Birthday VV Vinayak
  • prabhas
  • Prabhas-VV Vinayak
  • vv vinayak

Related News

Raajasabh Pre Release

‘రాజాసాబ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్

ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్ తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని

  • The Raja Saab Sequel

    ప్ర‌భాస్ రాజాసాబ్‌.. పార్ట్‌-2 పేరు ఇదేనా?!

  • Raajasaab Ticket Price

    ప్రభాస్ “రాజాసాబ్” ఫైనల్ టాక్

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

Latest News

  • తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్‌ ధరల పెంపు

  • శ్రీనివాస మంగాపురంతో ఘట్టమనేని వారసుడి గ్రాండ్ ఎంట్రీ..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేష్ బాబు!

  • గ్రీన్‌లాండ్‌ విషయంలో తగ్గేదిలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

  • ‘నీటి’ విషయంలో గొడవలు వద్దు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం – తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీయని మాట

  • గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd