Prabhas : వయనాడ్ బాధితుల కోసం 2 కోట్లు ప్రకటించిన స్టార్ హీరో..!
వయనాడ్ (Wayanad) బాధితుల కోసం వారి నిత్యావసరాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ సెలబ్రిటీస్ భారీ విరాళాలు ప్రకటించారు.
- By Ramesh Published Date - 11:10 AM, Wed - 7 August 24
Prabhas కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి అక్కడ జన జీవనం అస్తవ్యస్తమైందని తెలిసిందే. ఓ పక్క వరద నీటిలో ఎంతో ఆస్తి నస్టం జరగ్గా కొండ చరియలు పడి ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కేరళ ప్రభుత్వం అక్కడ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. వయనాడ్ ప్రాంత ప్రజల కోసం దేశంలోని అందరు ప్రజలు ప్రార్ధనలు చేస్తున్నారు.
ఇలాంటి కష్ట సమయాల్లోనే సినీ సెలబ్రిటీస్ తమ వంతుగా విరారళు ఇస్తున్నారు. ముఖ్యంగా వయనాడ్ (Wayanad) బాధితుల కోసం వారి నిత్యావసరాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ సెలబ్రిటీస్ భారీ విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, రాం చరణ్ కలిసి 1 కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వగా.. అల్లు అర్జున్ 25 లక్షలు విరాళం ఇచ్చారు. హీరోయిన్ రష్మిక మందన్న 10 లక్షలు విరాళం ఇచ్చారు.
ఐతే లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ వయనాడ్ బాధితుల సహాయార్ధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి 2 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించాడు. ప్రభాస్ పెద్ద మనసుకి అందరు సూపర్ అనేస్తున్నారు. సినిమా సెలబ్రిటీస్ ఇలా ప్రకృతి విపత్తు వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని కొంతమేరకు సాయం అందించేలా ముందుకొస్తున్నారు.
వయనాడ్ ఘటన కొండ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఒక ప్రమాద హెచ్చరిక అన్నట్టుగా జరిగింది. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రజలకు మేం అండగా ఉంటామని సినీ సెలబ్రిటీస్ ఎప్పుడు ముందుకొస్తారు. వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు కూడా ఇప్పుడు అందరు సెలబ్రిటీస్ తమ బాధ్యతగా కొంత విరాళం అందిస్తూ తమ మంచి మనసుని చాటుకుంటున్నారు.
Also Read : Indian Hockey Team: పోరాడి ఓడిన భారత హాకీ జట్టు.. కాంస్య పతకం కోసం పోరు..!
Related News
Prabhas Salaar 2 : ప్రభాస్ సలార్ 2 లో మలయాళ స్టార్..?
దేవ వర్సెస్ వరద రాజ మన్నార్ మధ్య ఫైటింగ్ సెకండ్ పార్ట్ లో అంతకుమించి అనిపించేలా ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ 2 శౌర్యాంగ పర్వం