Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ సినిమాను మర్చిపోయారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న OG
- By Ramesh Published Date - 11:16 AM, Sun - 21 January 24

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న OG సినిమాకు విపరీతమైన బజ్ ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా గ్రాండ్ రిలీజ్ చేస్తున్న సినిమాగా ఓజీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా కూడా పవన్ నటిస్తున్నాడని తెలిసిందే.
We’re now on WhatsApp : Click to Join
ఈ సినిమాను క్రిష్ (Krish) ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. పవన్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో సినిమాల విషయంలో కాస్త స్లోగా వెళ్తున్నారు. ఈ క్రమంలో చేయాల్సిన సినిమాలన్నీ కూడా పెండింగ్ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక పీరియాడికల్ మూవీని చేస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ ఏర్పడింది. హరి హర వీరమల్లు టైటిల్ అనౌన్స్ మెంట్ తో ఆ అంచనాలు డబుల్ అయ్యాయి.
అయితే సినిమా మూడేళ్లుగా సెట్స్ మీద ఉండటంతో రాను రాను ఆ సినిమా మీద ఆడియన్స్ లో ఆసక్తి కనుమరుగైంది. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు హరి హర సినిమా మీద ఏమాత్రం ఆసక్తి చూపట్లేదు. సినిమా ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ అన్నా సరే హమ్మయ్య అనుకునే పరిస్థితి ఉంది. కానీ క్రిష్ మాత్రం సినిమా మరో ఏడాది లేట్ అయినా కచ్చితంగా పూర్తి చేసి రిలీజ్ చేసి తీరుతాం అన్నట్టు ఉన్నాడు. ఓజీ తర్వాత హరి హర రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Vijay Devarakonda : రౌడీ హీరో కోసం ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..!
ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలే కాదు హరీష్ శంకర్ (Harish Shankar) తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కొంత భాగం పూర్తి చేశారు. మిగతా భాగం ఎప్పుడన్నది చెప్పడం కష్టం. ఇక పవన్ ని నమ్ముకుంటే కష్టమని రవితేజతో సినిమా మొదలు పెట్టి షూటింగ్ చేస్తున్నాడు హరీష్ శంకర్.
పవన్ బిజీ షెడ్యూళ్ల వల్ల అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ రెండిటిలో బిజీ గా ఉన్నాడు. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితేనే కానీ తర్వాత సినిమాల పరిస్థితి గురించి ఆలోచించడం కష్టమని చెప్పొచ్చు. ఓజీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉంది. అదికూడా పవన్ తన ఫుల్ సపోర్ట్ అందిస్తేనే.. లేదంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. హరి హర సినిమా మాత్రం ఇంకా చాలా టైం పట్టేలా ఉంది.