HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Poonam Kaur Made Scathing Remarks Against Trivikram Srinivas

త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు

  • Author : Vamsi Chowdary Korata Date : 01-01-2026 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Poonam Kaur Trivikram Iss
poonam kaur - trivikram issue

Poonam Kaur – Trivikram Srinivas : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోకి స్పందిస్తూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియా, మా అసోసియేషన్ వైఖరిని ప్రశ్నిస్తూ మహిళలపై వేధింపుల అంశాన్ని లేవనెత్తారు. ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

తెలుగు ప్రేక్షకులకు నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈమె. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు వైరాగ్యంతో, ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు లేటెస్టుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పూనమ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పూనమ్ కౌర్ గతంలో గురూజీ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో సినీ అభిమానులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గురూజీ అని పిలుస్తుంటారు కాబట్టి, ఆమె ట్వీట్స్ ఆయన్ని ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తుంటారు. అయితే ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ మాట్లాడిన ఓ వీడియోకి పూనమ్ రియాక్ట్ అయింది. ఆయన్ని అత్యంత దుర్మార్గుడిగా పేర్కొంది. అతన్ని సపోర్ట్ చేసే మీడియా వల్లే మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.

వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. స్రవంతి రవి కిషోర్ నిర్మాణంలో విజయ్ భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనికి కథ మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రవి కిషోర్ – త్రివిక్రమ్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా “కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి” అని తివిక్రమ్ అన్నారు.

కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి ❤️

AN UNFILTERED CHIT CHAT Will be releasing Today 🤟🏻

The ‘Evergreen Classic’ #NuvvuNaakuNachav Grand Re-release on JAN 1st.

Book Your seats 🎟️https://t.co/WRF3MM7jr4

#Trivikram… pic.twitter.com/0CoygBySrG

— BA Raju’s Team (@baraju_SuperHit) December 30, 2025

విక్రమ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను పలువురు ఫిలిం జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిపై పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు. “స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి, ఏమీ తెలియనట్టు తప్పించుకోగల అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను. మీలాంటి మీడియా అతనికి మద్దతు ఇవ్వడం వల్ల, అలాగే ‘మా’ (MAA) అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వారి బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతోంది. కానీ సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్‌ను పట్టుకుని గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళలపై వేధింపులు పెచ్చుమీరుతున్నాయి” అని పూనమ్ పోస్ట్ పేర్కొన్నారు.

ఇక్కడ ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించనప్పటికీ, దర్శకుడు మాట్లాడిన వీడియో కింద స్పందించిన కాబట్టి, ఆయన్ని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కొన్ని సినిమాలు డబ్బు, పేరు తీసుకొస్తాయి.. కానీ కొద్ది సినిమాలు మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి ❤️

AN UNFILTERED CHIT CHAT Will be releasing Today 🤟🏻

The ‘Evergreen Classic’ #NuvvuNaakuNachav Grand Re-release on JAN 1st.

Book Your seats 🎟️https://t.co/AnUMVHwv5k

#Trivikram… pic.twitter.com/6JkVcHNMIh

— L.VENUGOPAL🌞 (@venupro) December 30, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • poonam kaur - trivikram issue
  • tollywood
  • twitter war

Related News

Sivaji Warning

జూనియర్ సమంత అందాల ఆరబోత..! నీకు మంగపతే కరెక్ట్ అంటోన్న నెటిజన్లు

Ashu Reddy Glamour Show : సోషల్ మీడియా ద్వారా ‘జూనియర్ సమంత’గా గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రకృతి నేపథ్యంతో స్టైలిష్‌గా కనిపించిన అషు రెడ్డి ఫోటోలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, కొంతమంది నెటిజన్ల

  • Raja Saab Trailer 2.0

    రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

  • Shivaji

    శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?

  • Roshan Meka

    టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

  • Sivajii

    నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు

Latest News

  • పండగవేళ ప్రయాణికులకు TGSRTC షాక్

  • కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..

  • అరుదైన రికార్డ్ సాధించిన కాణిపాకం దేవస్థానం.. ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

  • కరెంట్ ఛార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం

Trending News

    • జనవరి 1న బ్యాంకుల పరిస్థితి ఏంటి?

    • 2026కు స్వాగతం ప‌లికిన న్యూజిలాండ్‌.. న్యూ ఇయ‌ర్‌కు తొలుత స్వాగ‌తం ప‌లికిన దేశం ఇదే!

    • నూతన సంవత్సరం ఇలాంటి గిఫ్ట్‌లు ఇస్తే మంచిద‌ట‌!

    • జ‌న‌వ‌రి నుండి జీతాలు భారీగా పెర‌గ‌నున్నాయా?!

    • ఈరోజు మద్యం సేవించి వాహనం నడిపితే జరిగితే ఈ శిక్ష‌లు త‌ప్ప‌వు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd