Allu Arjun : మరోసారి బన్నీ పక్కన బుట్టబొమ్మ..
- By Sudheer Published Date - 12:40 PM, Thu - 14 March 24

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన మరోసారి జోడి కట్టబోతుంది బుట్టబొమ్మ పూజా హగ్దే. గతంలో వీరిద్దరి కలయికలో DJ , అలా వైకుంఠపురం లో మూవీస్ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు మూడోసారి ఈ జోడి అలరించబోతుంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్(Sukumar) డైరెక్షన్ లో పుష్ప2(Pushpa2) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరో రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అందులో దర్శకుడు త్రివిక్రమ్(Trivikram) తో ఒకటికాగా.. మరొకటి తమిళ దర్శకుడు అట్లీ కుమార్(Atlee kumar) తో ఓ సినిమా చేయబోతున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం వరుస హిట్ల తో అట్లీ ఫుల్ క్రేజ్ లో ఉన్నాడు. ఈ మధ్యే షారుఖ్ ఖాన్ తో జవాన్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అలాంటిది ఐకాన్ స్టార్ తో సినిమా అనగానే ఓ రేంజ్ లో అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే(Pooja Hegde)ని ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. మరి ఈ సినిమా విశేషాలు తెలియాలంటే కొద్దీ నెలలు ఆగాల్సిందే.
Read Also : ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు