HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pooja Hegde In Vijay Deverakondas Rowdy Janardhan Item Song

Pooja Hegde: విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’ ఐటమ్ సాంగ్‌లో పూజా హెగ్డే

  • Author : Vamsi Chowdary Korata Date : 06-04-2026 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pooja hegde Rowdy Janardhan special item song
pooja hegde Rowdy Janardhan special item song

ఒకప్పుడు టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్న పూజా హెగ్డే, వరుస పరాజయాల తర్వాత తన రూటు మార్చింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ప్రస్తుతం ఈ ‘బుట్టబొమ్మ’ స్పెషల్ సాంగ్స్‌తో దూసుకుపోతోంది. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా, ‘కూలీ’లో మోనికాగా మెప్పించిన పూజా, ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో ఐటెం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. రవికిరణ్ కోల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా మార్కు మాస్ స్టెప్పులు హైలైట్‌గా నిలవనున్నాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని ‘గోల్డెన్ లెగ్’గా వెలిగిపోయింది కన్నడ బ్యూటీ పూజా హెగ్డే. ‘ముకుంద’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ పొడుగుకాళ్ల సుందరి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘అల వైకుంఠపురములో’, ‘డీజే’, ‘మహర్షి’, ‘అరవింద సమేత’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో పూజా అంటే మినిమం గ్యారెంటీ అనే ముద్ర వేసుకుంది. అయితే, సినిమా ఇండస్ట్రీలో విజయాలు ఎంత వేగంగా వస్తాయో, అపజయాలు కూడా అంతే వేగంగా పలకరిస్తాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజాకు, గత కొన్నేళ్లుగా కాలం కలిసి రావడం లేదు. ‘రాధే శ్యామ్’, ‘ఆచార్య’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆమెపై ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర పడిపోయింది.

అయితే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తరుణంలో పూజా తన రూటు మార్చింది. కేవలం లీడ్ రోల్స్ కోసమే వెయిట్ చేయకుండా స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తూ తన క్రేజ్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా ఆమె చేసిన సందడి ఇండస్ట్రీని ఊపేసింది. ఆ తర్వాత ‘F3’లో ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాలా’ అంటూ చిందేసి ప్రేక్షకులను అలరించింది. ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘కూలీ’ చిత్రంలో ‘మోనికా’ అనే స్పెషల్ సాంగ్‌తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేసింది. హీరోయిన్‌గా ప్లాపులు ఎదురవుతున్నా ఐటెం సాంగ్స్ విషయంలో మాత్రం పూజాకు తిరుగులేకుండా పోయింది.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్ధన’ చిత్రంలో పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్‌లో మెరవబోతోంది. రవికిరణ్ కోల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఒక మాస్ మసాలా సాంగ్ కోసం మేకర్స్ పూజాను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాట కంపోజిషన్ కూడా పూర్తయిందని, త్వరలోనే భారీ సెట్టింగ్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. విజయ్ దేవరకొండ ఎనర్జీకి పూజా గ్రేస్ తోడైతే, ఈ సాంగ్ బాక్సాఫీస్ వద్ద మంటలు పుట్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

పూజా హెగ్డే కెరీర్‌ను గమనిస్తే… ఆమె ఒకప్పుడు కేవలం స్టార్ సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేది. కానీ వరుస ఫ్లాపులు ఆమె మార్కెట్‌ను దెబ్బతీశాయి. ప్రస్తుతం హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, పూజా పూర్తిగా ఐటెం సాంగ్స్‌పైనే దృష్టి సారిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా వంటి సీనియర్ తారలు ఒకవైపు హీరోయిన్‌గా చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో డిమాండ్ పెంచుకుంటున్నారు. ఇప్పుడు పూజా కూడా అదే బాటలో నడుస్తోంది. తన గ్లామర్, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో ఐటెం సాంగ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Butta Bomma Pooja Hegde
  • Heroine Pooja Hegde
  • Item Songs
  • Rowdy Janardhan
  • Rowdy Janardhan movie
  • tollywood

Related News

Allu Arjun's 'Raka' – When is the release date?

RAAKA: అల్లు అర్జున్ ‘రాకా’.. రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’కి సంబంధించి వచ్చే ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోంది. సైన్స్ ఫిక్షన్, హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆకాశాన్నంటే అంచనాలు నె

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd