HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Speech At Hhvm Press Meet

HHVM Press Meet : చిత్రసీమ తనకు అన్నం పెట్టిందంటూ ఎమోషనలైనా పవన్ కళ్యాణ్

HHVM Press Meet : షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు

  • Author : Sudheer Date : 21-07-2025 - 1:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Pm
Pawan Pm

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు పాన్ ఇండియా స్థాయిలో జూలై 24న విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాకు క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించగా, అనంతరం జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఫస్ట్ పార్ట్ “స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రావడం, అలాగే భారీ బడ్జెట్‌లో రూపొందడం విశేషం. సినిమా షూటింగ్, రాజకీయ షెడ్యూల్స్ మధ్య సమయం కేటాయించడంలో ఎదురైన సవాళ్లతో పాటు వీఎఫ్ఎక్స్ జాప్యాల కారణంగా ఇది ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది.

PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన గ్రాండ్ ప్రెస్‌మీట్‌(Hari Hara Veera Mallu Press Meet)లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇది తన సినిమా జీవితంలో మీడియాతో మాట్లాడిన తొలి అనుభవమని పేర్కొంటూ, పోడియం లేకుండా మాట్లాడడం కూడా కష్టంగా ఉందన్నారు. సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో తనకు తెలియదని అన్నారు. ఈ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేయాలని ఒత్తిడి చేసిన ఏఎం రత్నం గురించి ప్రస్తావిస్తూ, “రీజినల్ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన మేధావి ఆయన” అంటూ ప్రశంసించారు. సినిమాను రూపొందించాలంటే ఎంతో సమర్పణ అవసరమని, ఇది సాధారణ పని కాదని చెప్పారు.

తాను యాక్సిడెంటల్ యాక్టర్‌ని, గత్యంతరంలేక సినిమాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజకీయ బాధ్యతల కారణంగా సినిమాలకు కొంతకాలంగా దూరమయ్యానని, అయితే రత్నం అడిగినప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధమయ్యానన్నారు. తన వంతు శ్రద్ధను ఈ సినిమా కోసం పూర్తిగా వెచ్చించానని చెప్పాడు. క్లైమాక్స్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా 57 రోజులు సమయం కేటాయించానని వివరించారు. “సినిమా నాకు ప్రాణవాయువు లాంటిది.. నన్ను బ్రతికించిందీ సినిమానే. నాకు అన్నం పెట్టింది చిత్రసీమే” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్

దర్శకుడు క్రిష్‌తో ఉన్న మొదటి విజన్ గురించి ప్రస్తావించిన పవన్, అతడి కథ నచ్చడంతో ఒప్పుకున్నానని చెప్పారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు. షూటింగ్‌కు రోజుకి రెండు గంటల సమయం మాత్రమే ఇవ్వగలిగానని, ఓ దశలో గోడౌన్‌లో కూడా షూట్ చేశామని చెప్పారు. సినిమా ఎంత హిట్ అవుతుంది, ఎంత కలెక్షన్లు వస్తాయన్నది తాను ఊహించలేనని, ఆ నిర్ణయం ప్రేక్షకులదే అని అన్నారు. ఈ సినిమా ఒక అనాథ కాదని, దీనికి తనకు సంబంధించిన బాధ్యతను పూర్తిగా నిర్వహించానని పవన్ స్పష్టం చేశారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ వేరు చేయడం తనకు నచ్చదని పవన్ కల్యాణ్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu
  • hari hara veera mallu pre release
  • hari hara veera mallu Press Meet
  • HHVM Press Meet
  • Pawan Kalyan
  • Pawan Kalyan Speech

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd