HHVM : మైత్రి చేతికి వీరమల్లు నైజాం రైట్స్..ఉత్తరాంధ్ర రికార్డ్స్
HHVM : ఉత్తరాంధ్రలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 150 స్క్రీన్లలో 135 స్క్రీన్లను హరిహర వీరమల్లుకు కేటాయించడం విశేషం
- By Sudheer Published Date - 12:40 PM, Mon - 21 July 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu ) నైజాంలో ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారనే సందిగ్ధతకు తెరపడింది. టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థ మైత్రి డిస్టిబ్యూషన్ ఈ హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. విడుదలకు మూడు రోజుల ముందే ఈ క్లారిటీ రావడం, అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
ఈ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పలువురు ప్రముఖ డిస్టిబ్యూటర్లు పోటీ పడ్డారు. ఒక దశలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు వినిపించగా, మరోవైపు ఏసియన్ సునీల్ కూడా ఈ హక్కుల కోసం ప్రయత్నించినట్లు సమాచారం. కానీ తక్కువ రేటు చెప్పడం వల్ల ఆయనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో గతంలో రావలసిన బాకీల విషయమై ఫిలిం ఛాంబర్‌కు కూడా లేఖ రాసినట్టు టాక్. అన్ని విషయాలు పరిశీలించి చివరికి మైత్రి డిస్టిబ్యూషన్‌కి ఈ హక్కులు అప్పగించడం జరిగింది.
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత
ఇంకా ఉత్తరాంధ్రలో సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆ ఏరియాలో ఉన్న మొత్తం 150 స్క్రీన్లలో 135 స్క్రీన్లను హరిహర వీరమల్లుకు కేటాయించడం విశేషం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదొక ఘనమైన విడుదలగా నిలవబోతోంది. మొదటి వారంలో 125 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇంత భారీ స్థాయిలో ఓపెనింగ్ ఇవ్వడం ద్వారా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాల రికార్డులను ఈ చిత్రం దాటి పోతుందని అంచనాలు ఉన్నాయి.
జూలై 24న విడుదల కానున్న ఈ సినిమాకు, జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు టాక్ బాగుంటే, ఈ చిత్రం టాలీవుడ్ టాప్ 3 కలెక్షన్ రికార్డుల్లోకి ఎంటర్ అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులంతా ఇప్పుడు ఈ సినిమాపై ఆసక్తి పెట్టారు. భారీ రిలీజ్, అంచనాలు, స్టార్డమ్ కలిసొస్తే ‘హరి హర వీరమల్లు’ మరో సంచలనాన్ని సృష్టించే అవకాశముంది.