HHVM Trailer : ‘హరిహర’ ట్రైలర్‌పై పవన్ కళ్యాణ్ ఫస్ట్ రియాక్షన్
HHVM Trailer : ట్రైలర్ చూసిన తర్వాత పవన్ డైరెక్టర్‌ను హగ్ చేసుకుంటూ “అద్భుతంగా ఉంది, చాలా కష్టపడ్డావ్” అంటూ ప్రశంసలు గుప్పించారు
- By Sudheer Published Date - 09:11 PM, Wed - 2 July 25

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన భారీ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ట్రైలర్‌పై హీరో పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా జూలై 24న విడుదల కానుండగా, ట్రైలర్‌ను జూలై 3 ఉదయం 11:10కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదలకు ముందే పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ప్రత్యేక ప్రివ్యూ షో నిర్వహించారు. మేకర్స్, దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలు పవన్‌తో కలిసి ట్రైలర్ వీక్షించారు. ట్రైలర్ చూసిన తర్వాత పవన్ డైరెక్టర్‌ను హగ్ చేసుకుంటూ “అద్భుతంగా ఉంది, చాలా కష్టపడ్డావ్” అంటూ ప్రశంసలు గుప్పించారు.
Tirumala Devotees : తిరుమలకు వెళ్తున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి !
ఈ సినిమా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదాలు పడడంతో ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేయడంతో అభిమానుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో, ట్రైలర్ బాగా ఉంటే సినిమా విడుదలకు పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ కావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈసారి మాత్రం సినిమా ఖచ్చితంగా అనుకున్న తేదీకే విడుదల కావాలని అభిమానులు కోరుతున్నారు. రిలీజ్ సమయంలో అడ్డంకులు రాకుండా చూడాలని నిర్మాతలపై వారు ఒత్తిడి కూడా పెంచుతున్నారు.
మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఒక యోధుడిగా కనిపించనున్నాడు. మొదట ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేయగా, అనంతరం జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించారు. సినిమాటోగ్రఫీకి జ్ఞాన శేఖర్ మరియు మనోజ్ పరమహంస పనిచేశారు. చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించగా, మొదటి భాగం ‘Sword vs Spirit’ పేరుతో విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
Priceless appreciation ❤️❤️❤️
Everything will be seen tomorrow….the grandeur, visuals and the sound. It’s going to be 🔥🔥#HHVMTrailer #HariHaraVeeraMallu ⚔️ pic.twitter.com/R61Xy0LlKW— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 2, 2025