Tholi Prema : ‘తొలిప్రేమ’లోని ఆ పాట చూడడం కోసం పవన్.. రాత్రి 2 గంటల వరకు బయట బల్లపైనే..
తొలిప్రేమ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తరువాత రామానాయుడు స్టూడియోలో ఎడిటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సాంగ్ ఎడిటింగ్ జరుగుతుందని తెలుసుకున్న పవన్ రాత్రి 8 గంటల సమయంలో స్టూడియోకి వచ్చాడట.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 31 July 23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లోనే కాదు టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమా ‘తొలిప్రేమ'(Tholi Prema). తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన లవ్ స్టోరీస్ లో ఆ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కరుణాకరన్(Karunakaran) దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాలోని కథ మాత్రమే కాదు, పాటలు కూడా ఎవర్ గ్రీన్. తమిళ సంగీత దర్శకుడు దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ మూవీ కోసం మొత్తం ఐదు పాటలు చేయగా.. మొత్తం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
కాగా ఈ మూవీలోని ‘ఈ మనస్సే’ (Ee Manase Se Se) సాంగ్ అంటే పవన్ కి చాలా ఇష్టమంట. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న తరువాత రామానాయుడు స్టూడియోలో ఎడిటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సాంగ్ ఎడిటింగ్ జరుగుతుందని తెలుసుకున్న పవన్ రాత్రి 8 గంటల సమయంలో స్టూడియోకి వచ్చాడట. కరుణాకరన్ పిలిచి.. “సాంగ్ రెడీ అయ్యిందా? ఒకసారి చూపిస్తావా?” అని అడిగాడట పవన్. దానికి కరుణాకరన్.. “కొంచెం వెయిట్ చేయండి అన్నయ్య చూపిస్తాను” అని చెప్పాడట.
అలా చెప్పి ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్లిన కరుణాకరన్.. తాను అనుకున్న విధంగా సన్నివేశాల ఎడిటింగ్ లో మార్పులు చేర్పులు చేసి బయటకి వచ్చేప్పటికి అర్ధరాత్రి 2గంటలు అయింది. అయితే చాలా లేటు అయ్యింది కదా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఉంటాడని కరుణాకరన్ అనుకున్నాడు. కానీ బయటకి వచ్చే చూస్తే పవన్ బల్లపై కూర్చొని కనిపించాడట. దీంతో కరుణాకరన్ పవన్ కి సారీ చెప్పి ఫైనల్ ఎడిట్ చేసిన సాంగ్ ని చూపించారట. పవన్ ఆ సాంగ్ అర్ధరాత్రి 2 గంటలకు చూసి అక్కడ నుంచి వెళ్ళాడు. మాంటేజ్‌లో ఆ సాంగ్ ని చేశారు. ఆ సాంగ్ మొత్తం చూశాకా.. పవన్, కరుణాకరన్ ని గట్టిగా కౌగలించుకుని చాలా బాగా చేశావు అని మెచ్చుకున్నాడట. ఇక ఆ సాంగ్ పవన్ కి మాత్రమే కాదు చాలామంది అయన అభిమానులకు కూడా ఫేవరెట్ అయింది.
Also Read : Bro Collections : అదరగొడుతున్న ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్లు..