Pawan Kalyan: OG సినిమాలో పవన్ క్రేజీ పాట రాబోతోందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. సాహో చిత్రం చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. సాహూ అపజయం పాలైనప్పటికీ సుజిత్ కు మంచి పేరొచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 09:11 PM, Thu - 18 January 24

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) మరోసారి తన గాత్రం వినిపించనున్నాడు. సాహో చిత్రం చిత్రం తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. సాహూ అపజయం పాలైనప్పటికీ సుజిత్ కు మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరు ఓజి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్.
బ్రో సినిమాతో ఇటీవల ఆడియన్స్ ని పలకరించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తే.. వావ్ అనిపించేలా రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా థియేటర్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే.. పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో ఓజీ మూవీకి కాస్త బ్రేక్ పడింది. ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.
ఓజి సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడబోతున్నారట. పవర్ స్టార్ మల్టీ టాలెంటెడ్. పాట పాడడమే కాదు.. కొరియోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్. ఇలా సినిమాకు సంబంధించిన పలు శాఖల్లో మంచి పట్టు ఉంది. ఈ సినిమాకి సెన్సేషనల్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. థమన్ పవన్ తో ఓ పాట పాడించాలి అనుకుంటున్నాడట. ఇందులో ఓ సందర్భం ఉందట. ఆ సందర్భానికి అనుగుణంగా వచ్చే పాటను పాడించాలి అనుకోవడం.. దీనికి పవన్ కూడా ఓకే చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. కాగా ఓజీ సినిమాతోనే ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీలో విలన్‌గా చేశాడు. ఇప్పుడు తెలుగులోకి ఓజీ ద్వారా విలన్‌గా పరిచయం కానున్నాడు.
పవన్ సినిమాలకు థమన్ సంగీతం అందించాడు. అయితే.. ఇంత వరకు పవన్ తో పాట పాడించలేదు. అందుకనే ఈసారి థమన్ ఫిక్స్ అయ్యాడట పవన్ తో పాట పాడించాలని. ఓజీ గ్లింప్స్ తో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా కోసం పవన్ పాట కూడా పాడితే.. మరింత క్రేజ్ రావడం ఖాయం. ఇంతకీ.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే.. ఏపిలో ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్ లో ఉండే అవకాశం ఉంది. ఆతర్వాత పవన్ డేట్స్ ఇస్తారు కాబట్టి సమ్మర్ తర్వాతే ఓజీ థియేటర్లోకి రావచ్చు.
Also Read: Post Workout Tips : వ్యాయామం చేసిన తర్వాత ఈ నియమాలు తప్పనిసరి.. అవేంటో తెలుసుకోండి