OG Movie : ఆ ఫైట్ సీన్ కోసం.. పవన్ మూడు రోజులు కష్టపడ్డారట..
ఆ ఒక్క ఫైట్ సీన్ కోసం పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారట. హాఫ్ డేలో చేయాల్సిన సీన్ ని మూడు రోజులు చేశారట.
- Author : News Desk
Date : 27-05-2024 - 1:01 IST
Published By : Hashtagu Telugu Desk
OG Movie : పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టార్ మూవీ ‘ఓజి’. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం.. 90’s బ్యాక్‌డ్రాప్ లో పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతుంది. ఈక్రమంలోనే ఈ మూవీ మార్షల్ ఆర్ట్స్ లోని డిఫరెంట్ ఆర్ట్స్ ని ఈ మూవీలో చూపించబోతున్నారట. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కొన్ని సినిమాల్లో పవన్ తన మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ ని చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేసారు.
ఇప్పుడు ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేయడం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారట. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన ‘ఐకిడో’ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఆ ఫైట్ గురించి దర్శకుడు సుజిత్.. పవన్ కళ్యాణ్ కి చెప్పగా, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారట. అంతేకాదు ఆ ఫైట్ బాగా రావాలని ముంబై, పూణే నుంచి ప్రొఫిషనల్ ఐకిడో మాస్టర్స్ ని పిలిపించుకొని మరి పవన్ కళ్యాణ్ ప్రాక్టీస్ తీసుకున్నారట.
దర్శకుడు సుజిత్ ఈ సీన్ ని హాఫ్ డేలో షూట్ చేసేయాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. ఈ ఫైట్ బాగా రావాలని భావించి.. దాదాపు మూడు రోజుల పాటు ఆ సీన్ ని చిత్రీకరించారట. మరి పవన్ అంత శ్రద్ధ తీసుకోని చేసిన ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఇంకా 25 శాతం షూటింగ్ పూర్తి చేయాల్సింది ఉంది. మరి ఆ టైంకి షూటింగ్ పూర్తి చేసేసి మూవీని తీసుకు వస్తారా లేదా వాయిదా వేస్తారా అనేది చూడాలి.
#OG September 27th jathini denguhuname🥵🥵🥵🥵🔥🔥🔥🔥 🥹🥹
#BVVonMay31st @PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/H8ue1Vkz9N— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) May 26, 2024