Pawan Kalyan Reveals: బ్రహ్మచారిగా ఉండలానుకున్నా.. కానీ 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!
అసలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అందుకు కారణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పటికీ తెలియదు.
- Author : Balu J
Date : 03-02-2023 - 3:32 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ప్రస్తావన రాగానే కచ్చితంగా 3 పెళ్లిళ్ల (Marriages) ఇష్యూ ప్రధానంగా వినిపిస్తుంటుంది. ఇటు పొలిటికల్, అటు టాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంటుంది. అయితే అసలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అందుకు కారణాలు ఏంటి? అనే విషయాలు ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. ఇటీవల ఆయన బాలయ్య (Balakrishna) అన్ స్టాపబుల్ షో లో తన మూడు పెళ్లిళ్ల గురించి ఓపెన్ కామెంట్స్ చేశారు.
బాలయ్య సూటిగా పవన్ ను ప్రశ్నించారు. అయితే పవన్ (Pawan Kalyan) నుంచి మాత్రం అంతే సూటిగా సమాధానం రాలేదు. మరీ ముఖ్యంగా బ్రహ్మచారిగా ఉండాలనుకొని, 3 పెళ్లిళ్లు చేసుకున్నానని చెప్పారు. “అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. బ్రహ్మచారిగా ఉంటూ, యోగమార్గంలో వెళ్లిపోవాలనుకున్నాను. ఇన్ని పెళ్లిళ్లు నాకే జరిగాయా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నేను ఏదీ ప్లాన్ చేయలేదు. మొదటిసారి పెళ్లి చేసుకున్నాను, ఇంట్లో చూసిన సంబంధం అది. రిలేషన్ షిప్ (Relationship) లో కొన్ని కుదరలేదు, అలా విడిపోయాం.” రెండోసారి మళ్లీ పెళ్లి చేసుకున్నానని… అప్పుడు కూడా అభిప్రాయబేధాలొచ్చాయన్నారు పవన్. కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక రేణుదేశాయ్ తో విడిపోవాల్సి వచ్చిందన్నారు. అయితే ప్రతి ఒక్కరికీ చట్టబద్దంగానే విడాకులిచ్చి (Divorce) మరో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.
“ప్రతిసారి 3 పెళ్లిళ్లు అంటూ విమర్శిస్తున్నారు. నేను ముగ్గుర్ని ఒకేసారి చేసుకోలేదు. ముగ్గురి (Three Members) తో ఒకేసారి ఉండలేదు. ముగ్గుర్నీ ఒకే గదిలో పెట్టలేదు. ఒకరితో కుదరలేదు కాబట్టి ఇంకొకర్ని చేసుకున్నారు. వాళ్లతో కూడా కుదర్లేదు కాబట్టి వేరే ఇంకొకర్ని చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి చట్టబద్దంగా విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాను. చాలామందికి అది ఆయుధంగా మారిపోయింది. నాకు మాత్రం 3 పెళ్లిళ్లపై ఎలాంటి గిల్ట్ లేదు.” అని పవన్ కళ్యాన్ (Pawan Kalyan) తేల్చి చెప్పారు.
Also Read: 9 Crore Condoms: రెచ్చిపోతున్న లవర్స్.. 9 కోట్ల కండోమ్స్ రెడీ!