BRO Movie Collections: ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే రూ. 30 కోట్ల వరకు కలెక్షన్స్ (BRO Movie Collections) ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 11:27 AM, Sat - 29 July 23

BRO Movie Collections: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 48 కోట్ల వరకు కలెక్షన్స్ (BRO Movie Collections) ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ మూవీ 14 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకున్నట్లు సమాచారం. గోదావరి జిల్లాల్లో ఐదు కోట్లు, ఉత్తరాంధ్ర, గుంటూరులలో రెండున్నర కోట్లకుపైగా బ్రో మూవీ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వర్షాల ఎఫెక్ట్ కారణంగా తొలిరోజు బ్రో మూవీ 20 నుంచి 22 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ వారి అంచనాల్ని అధిగమిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 35. 50 కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ మూవీ అయిన వినోదయ సిత్తం ఆధారంగా బ్రో మూవీ తెరకెక్కింది. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు.
Also Read: Kushi Title Song: ఖుషి సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్
త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రో మూవీ కంటెంట్ విషయంలో కొన్ని విమర్శలు వినిపించినా కలెక్షన్స్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. శని, ఆదివారాలు కూడా సెలవులు కావడంతో బ్రో మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కీలక పాత్రలను పోషించారు. స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ బ్రో మూవీని నిర్మించారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ‘బ్రో’ సినిమా ఆల్మోస్ట్ వంద కోట్లు టచ్ చేసింది. సుమారు రూ. 98 కోట్లకు ఏపీ, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ అమ్మారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘OG’లో నటిస్తున్నారు.