HHVM : రిలీజ్ కు దగ్గరపడుతున్న సమయంలో సినిమా స్టోరీ లీక్ ..షాక్ లో ఫ్యాన్స్
HHVM : పవన్ కళ్యాణ్ పాత్ర ఒక అనాథగా మొదలై, ఆలయంలో పెరిగి, తరువాత సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా ఎదిగేలా ఉంటుందని వెల్లడించారు.
- Author : Sudheer
Date : 10-07-2025 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) జూలై 24 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తొలుత క్రిష్ జగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తర్వాత అనివార్య కారణాల వల్ల జ్యోతికృష్ణ చేతుల్లోకి వెళ్లింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సినిమా విడుదలకు సమీపిస్తున్న వేళ మూవీ యూనిట్ ప్రమోషన్ ను స్పీచ్ చేసింది.
Pragya Jaiswal : పాపం..బాలయ్య హీరోయిన్ ఎంత చూపించిన పట్టించుకునే నాథుడే లేడు
ఈ క్రమంలో నిర్మాత ఏఎం రత్నం (A AM Ratnam) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పాత్ర ఒక అనాథగా మొదలై, ఆలయంలో పెరిగి, తరువాత సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా ఎదిగేలా ఉంటుందని వెల్లడించారు. ఔరంగజేబు కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందించిన ఈ కథ, పవన్ నిజ జీవిత ధర్మ పోరాట లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని వివరించారు. ఇది పూర్తిగా కల్పిత కథేనని, ఎవ్వరినీ ఉద్దేశించకుండా రూపొందించలేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ లీక్ వల్ల మూవీపై మరింత ఆసక్తి పెరిగింది.
Google AI : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఏఐ మోడ్..ఇక సమాచారం వెతకడం మరింత సులభం
అయితే ఈ చిత్రంలో పవన్ పాత్రను తెలంగాణ యోధుడు పండుగ సాయన్న ఆధారంగా రూపొందించారని కొందరు బీసీ సంఘాల నేతలు ఆరోపించారు. ఇది పండుగ సాయన్న పేరును అపకీర్తి చేస్తుందంటూ వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే తాజాగా నిర్మాత చేసిన వ్యాఖ్యలతో వివాదం కొంతవరకు చల్లబడిందని తెలుస్తోంది. మొత్తానికి కథ ముందే బయటపడడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయగా, సినిమా విడుదలపై మరింత ఉత్కంఠ రేకెత్తింది.