Pragya Jaiswal : పాపం..బాలయ్య హీరోయిన్ ఎంత చూపించిన పట్టించుకునే నాథుడే లేడు
Pragya Jaiswal : తాజాగా తెల్లటి బికినీలో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నడుము, ఎద అందాలను బోల్డ్‌గా ఆరబోస్తూ ఇచ్చిన పోజ్ లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈమె గ్లామర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇంత గ్లామర్ ను నిర్మాతలు ఎందుకు పట్టించుకోవడం లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Author : Sudheer
Date : 10-07-2025 - 8:40 IST
Published By : Hashtagu Telugu Desk
“కంచె” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)..తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆ తరువాత ఆమె కెరీర్ అనుకున్న రేంజ్ లో కొనసాగలేకపోతుంది. వరుణ్ తేజ్ సరసన ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చినప్పటికీ, తర్వాతి సినిమాలు ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. దాంతో ఒక దశలో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె ఐటెం సాంగ్స్ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కూడా ఆమెకు అవకాశాలు తలుపు తట్టలేదు.
Google AI : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఏఐ మోడ్..ఇక సమాచారం వెతకడం మరింత సులభం
2021లో బాలకృష్ణ సరసన నటించిన “అఖండ” సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు మళ్లీ ఆశలు చిగురించాయి. డాకూ మహారాజ్ మూవీతో మరోసారి మంచి పాత్రలో కనిపించినా, ఆ తర్వాత నిర్మాతల నుండి సరైన స్పందన రాలేదు. అభిమానులు ఆమెకు అవకాశాలు వస్తాయని ఆశించినా, ప్రస్తుతం ఆమెకు పెద్దగా ప్రాజెక్టులు లేవు. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అయిన “అఖండ 2″లో బాలయ్యతో కలిసి నటిస్తున్నా, ఇతర సినిమాల్లో ఆమెను చూసే అవకాశం లేకుండా పోయింది.
అవకాశాల కోసం ప్రగ్యా సోషల్ మీడియాను వేదికగా మార్చుకుంది. గ్లామర్ ఫొటోషూట్స్‌తో తన క్రేజ్ నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా తెల్లటి బికినీలో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నడుము, ఎద అందాలను బోల్డ్‌గా ఆరబోస్తూ ఇచ్చిన పోజ్ లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈమె గ్లామర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇంత గ్లామర్ ను నిర్మాతలు ఎందుకు పట్టించుకోవడం లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.