Nagababu : ఎక్స్ అకౌంట్‌ని డీ యాక్టీవ్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ విషయమే కారణమా..?
ఎక్స్ అకౌంట్‌ని డీ యాక్టీవ్ చేసిన నాగబాబు. అల్లు అర్జున్ వైసీపీ ప్రచార విషయమే ఇందుకు కారణమా..?
- By News Desk Published Date - 08:23 PM, Thu - 16 May 24

Nagababu : ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న విషయాలు చూస్తుంటే.. ఈసారి జరిగిన ఏపీ ఎన్నికలు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవ తీసుకువచ్చినట్లు కనిపిస్తుంది. చిరంజీవి నుంచి మెగా హీరోలంతా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి తోడుగా నిలిచి ప్రచారాలు, పర్యటనలు చేసి తమ ప్రేమని, విశ్వాసాన్ని చాటుకున్నారు. అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ సైతం పిఠాపురం పర్యటన చేసి.. పవన్ కి మద్దతు తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కి ఒక ట్వీట్ తో మద్దతు తెలిపి.. వైసీపీలో ఉన్న తన స్నేహితుడు కోసం నంద్యాల పర్యటన చేయడం అందరికి షాక్ ఇచ్చింది.
అల్లు అర్జున్ చేసిన పని పై మెగా అభిమానులు, జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో నాగబాబు చేసిన ఓ ట్వీట్ మరింత హీట్ ని పుట్టించింది. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే” అంటూ నాగబాబు ట్వీట్ చేయడంతో.. సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో, మీడియాలో ఈ గొడవ హాట్ టాపిక్ మారింది. నాగబాబు ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేసారు అనేది పెద్ద చర్చగా మారింది.
కొందరు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలామంది అల్లు అర్జున్ అనే అభిప్రాయపడుతున్నారు. కానీ అసలు నాగబాబు ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి.. ఎక్స్ (X)లో ఆయన్ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టంలేకో, ఏమో తెలియదు గాని.. నాగబాబు ఎక్స్ అకౌంట్ ని డీ యాక్టీవ్ చేసేసారు. దీంతో ఈ విషయం మరింత వేడిక్కింది.
ఇది ఇలా ఉంటే, ఈ విషయం గురించి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. “వాళ్ళ పర్సనల్ విషయంలో మనం కలగజేసుకోకూడదు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఆ ట్వీట్ ఎవరు తప్పు చేసారో వారికీ గట్టిగా తగులుతుందిలే” అంటూ కామెంట్స్ చేసారు.
Ey nakkAA thappu Cheste aa nakkAA ki taguluddi @NagaBabuOffl Tweet – @SVSN_Varma 😂🔥 pic.twitter.com/J9KjK4StrU
— Raees (@RaeesHere_) May 16, 2024