Pawan Kalyan : ఓజి కాదు వీరమల్లు రాబోతున్నాడు.. ఆ నెలలోనా..?
ఓజి కాదు వీరమల్లు ముందుగా రాబోతున్నాడు.. వీరమల్లు బ్యాలన్స్ షూట్ కి సిద్ధం చేసుకోమని నిర్మాతలకు కబురు పంపిన పవన్..
- Author : News Desk
Date : 31-05-2024 - 8:19 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్స్ కి బ్రేక్ ఇచ్చి, ఇక సినిమా షెడ్యూల్స్ పై ఫోకస్ పెట్టబోతున్నారు. రాజకీయ వ్యవహారాలు వల్ల హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్స్ కి పెద్ద విరామమే వచ్చింది. ఇప్పుడు ఆ షూటింగ్స్ అన్ని పట్టాలు ఎక్కబోతున్నాయి. అయితే వీటిలో ఏది ముందుగా పట్టాలు ఎక్కనుంది..? ఏది ముందుగా రిలీజ్ కానుందని..? అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
సెప్టెంబర్ లో ‘ఓజి’ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ముందుగా ‘ఓజి’ షూటింగ్ లో పాల్గొంటాడని అందరూ భావించారు. అయితే పవన్ ఇప్పుడు ఓజి కాదని వీరమల్లు వైపు అడుగులు వేస్తున్నారట. ఓజి రిలీజ్ ని పోస్టుపోన్ చేస్తున్నారట. హరిహర వీరమల్లుని స్టార్ట్ చేసి మూడేళ్లు అయ్యిపోయింది. దీంతో ముందుగా ఆ సినిమాని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట.
వీరమల్లు బ్యాలన్స్ షూట్ కి సిద్ధం చేసుకోమని నిర్మాతలకు పవన్ కబురు పంపించారట. జూన్ 4న ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే.. కాల్ షీట్స్ పై క్లారిటీ ఇస్తానని పవన్ చెప్పారట. దానికి తగ్గట్లు సిద్ధంగా ఉండమని కబురు పంపించారట. జూన్ నెలలోనే వీరమల్లు షూటింగ్ మొదలు కానుందట. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. మొదటి పార్ట్ ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
‘ఓజి’ని ఈ ఏడాదిలో రిలీజ్ చేయడం లేదంట. ఓజికి బదులుగా వీరమల్లుని తీసుకు వస్తున్నారట. డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. మరి వీరమల్లు ఆగమనం ఎప్పుడు ఉండబోతుందో చూడాలి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ తో అయితే.. మంచి హైప్ ని క్రియేట్ చేసారు.