Pawan Kalyan : పవన్ నాకు డబ్బులిచ్చాడు..అసలు నిజం చెప్పిన డైరెక్టర్
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసిన అన్ని రోజులు పారితోషికం కూడా చెల్లించారని, ఇంకా పవన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ మరో నిర్మాత ద్వారా సినిమా చేద్దామని సందేశం పంపించిన విషయాన్ని వెల్లడించాడు
- Author : Sudheer
Date : 17-04-2025 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని వివరిస్తూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. “ఏమైంది ఈవేళ” వంటి చిన్న చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించిన సంపత్, తన రెండో సినిమా “రచ్చ” ద్వారా రామ్ చరణ్‌తో కలిసి పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా, అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పి పవన్ మీద విమర్శలు చేసినవారికి సంపత్ నంది ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
మొదటగా పవన్ కళ్యాణ్‌కి “బెంగాల్ టైగర్” కథ వినిపించాడట. ఆ కథ పవన్‌కు నచ్చినప్పటికీ, మరొక కథ చేయాలని సూచించారట. ఆ కొత్త కథపై సంపత్ ఏడాదిన్నర పాటు పని చేశాడట. అయితే ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉండటంతో, చివరికి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది కామన్ అని, ఒక కథ పనిచేయకపోతే మరొకదాన్ని ట్రై చేయడం సాధారణం అని అభిప్రాయపడ్డారు.
TPCC Protest : కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులు : భట్టి
పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసిన అన్ని రోజులు పారితోషికం కూడా చెల్లించారని, ఇంకా పవన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ మరో నిర్మాత ద్వారా సినిమా చేద్దామని సందేశం పంపించిన విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం పవన్ బిజీగా ఉన్నారని, కానీ భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు.