Mark Shankar : కుమారుడ్ని హైదరాబాద్ కు తీసుకొచ్చిన పవన్
Mark Shankar : ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి వచ్చారు.
- By Sudheer Published Date - 09:59 AM, Sun - 13 April 25

జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar)ను తీసుకొని 13 ఏప్రిల్ 2025, శనివారం నాడు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల సింగపూర్(Singapore)లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడగా, చికిత్స అనంతరం కోలుకున్నాడు. తన కుమారుడి పరిస్థితి తెలిసిన వెంటనే పవన్ కల్యాణ్ సింగపూర్‌కు వెళ్లి, చికిత్స పూర్తి అయిన తరువాత అతడిని స్వయంగా తీసుకొని భారత్‌కు తిరిగివచ్చారు.
ITR Form: సీనియర్ సిటిజన్లకు ఏ ఐటీఆర్ ఫారం సరైనది?
ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ తన భార్య అన్నాలెజినోవా, కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి వచ్చారు. విమానాశ్రయం వద్ద పవన్ తన కుమారుడిని ఎత్తుకుని బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రజలు మాత్రమే కాకుండా, రాజకీయ, సినీ ప్రముఖులు కూడా మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి సైతం భార్య సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లడం గమనార్హం. ప్రతి క్షణం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉండటం, అతడు కోలుకుంటుండటంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, నాయకులు అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సంఘటనపై ప్రజలు పవన్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు.
Pavan Kalyan is back in India with Mark Shankar from Singapore!#MarkShankarPawanovich #pavankalyan #FireAccident pic.twitter.com/RhrehaeWuL
— North East West South (@prawasitv) April 12, 2025