ముంబై షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకున్న ‘ఆస్కార్ చల్లగరిగ’
చిల్కూరి సుశీల్ రావు రూపొందించిన డాక్యుమెంటరీ "ఆస్కార్ చల్లగరిగ" ప్రత్యేక ప్రస్తావన (Special Mention Award) అవార్డు గెలుచుకుంది
- By Sudheer Published Date - 11:12 PM, Sun - 10 December 23
ముంబై వేదికగా ఈరోజు (డిసెంబర్ 10, 2023 ) జరిగిన 12వ ముంబై షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (12th Mumbai Shorts International Film Festival)లో ‘నాటు నాటు’ (Naatu Naatu Song) గీత రచయిత సుభాష్ చంద్రబోస్(Chandrabose) పై చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) రూపొందించిన డాక్యుమెంటరీ “ఆస్కార్ చల్లగరిగ” (Oscar Challagiriga) ప్రత్యేక ప్రస్తావన (Special Mention Award) అవార్డు గెలుచుకుంది. 2023 ఆస్కార్ అవార్డ్స్ లలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ కు గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత చంద్రబోస్..తన స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగకు వచ్చి తన సంతోషాన్ని గ్రామస్థులతో పంచుకున్నారు. ఈ ఆస్కార్ అవార్డు గెలిచింది నేను కాదు చల్లగరిగ గ్రామమేనని….ఇది తెలుగుపాట గెలుపు అని చెప్పుకొచ్చారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. దీనిని చిల్కూరి సుశీల్ రావు డాక్యుమెంటరీ గా తెరకెక్కించాడు.
ఈ డాక్యుమెంటరీ డిసెంబరు 2023లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక చేయబడింది. అలాగే ఈరోజు ముంబై వేదికగా జరిగిన 12వ ముంబై షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు. ఫెస్టివల్‌ని నిర్వహించిన మినీ బాక్స్ ఆఫీస్ వ్యవస్థాపకుడు-డైరెక్టర్ రాంభుల్ సింగ్ ఆదివారం సాయంత్రం స్క్రీనింగ్‌లు ముగిసిన తర్వాత అవార్డు విజేతల జాబితాను ప్రకటించారు. జ్యూరీలో భారతదేశం మరియు విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ డాక్యుమెంటరీ లో చంద్రబోస్ భార్య, స్వయంగా ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర చేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.
Read Also : Rashmika Mandanna : అమితాబ్ షోలో అభిమానికి రష్మిక వీడియో కాల్.. ప్రేమిస్తున్నాను అంటూ అభిమాని ప్రపోజల్..
Tags
Related News
8th Indian World Film Festival-2024 : అరుదైన అవార్డు అందుకున్న “హీరో ఆఫ్ ద సీ”
హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి సుశీల్ రావు (Chilkuri Sushil Rao) నిర్మించి, దర్శకత్వం వహించిన “హీరో ఆఫ్ ద సీ” (“Hero Of The Sea” ) అనే డాక్యుమెంటరీ.. హైదరాబాద్‌లో మార్చి 10 న జరిగిన 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్-2024 (8th Indian World Film Festival)లో ‘Honourable Jury Mention’ అవార్డును గెలుచుకుంది. రీసెంట్ గా నౌకలపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పైరేట్స్‌పై భారత నావికాదళం యొక్క దృఢమైన చర్యపై ఈ […]