Niharika Konidela: బెడ్ పై ఒకరు, హెడ్ లో మరొకరు.. నెట్టింట్లో నిహారిక డైలాగ్స్ వైరల్
నిహారిక మళ్లీ సినిమాల్లోకి (Tollywood) ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
- By Balu J Published Date - 04:49 PM, Wed - 10 May 23

మెగా డాటర్ కొణిదెల నిహారిక (Niharika Konidela) ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తన భర్త చైతన్య నుంచి విడిపోయినట్టుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిహారిక డివోర్స్ విషయమై ఏమీ మాట్లాడనప్పటికీ దాదాపుగా విడిపోయినట్టుగా హింట్స్ ఇస్తోంది. అయితే తాజాగా నిహారిక మళ్లీ సినిమాల్లోకి (Tollywood) ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పుష్ప2 సినిమాలో కూడా నటించబోతున్నట్టు వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలో పెళ్లి తర్వాత తనే సొంతంగా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ (Pink Elephant Pictures) పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించి వెబ్ సిరీస్‌లు నిర్మించింది. అంతేకాదు. బీబీసీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమడా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels) వెబ్ సిరీస్ ద్వారా నిహారిక మళ్లీ యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో ఆమె చెప్పిన డైలాగ్ అభిమానులకు షాక్ ఇచ్చింది.
ట్రైలర్‌లో నిహారిక చెప్పిన డైలాగ్ విషయానికొస్తే.. ‘నాకు బెడ్‌పై రోషన్ కావాలి, హెడ్ లో భార్గవ్ ఉన్నాడు’ అనే డైలాగ్ ఈ సిరీస్‌లో ఆమె కన్‌ఫ్యూజన్ స్టేట్‌కు అద్దం పడుతుంది. అయితే, ఇప్పుడు ఇదే డైలాగ్‌పై ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘ఇలా బెడ్‌పై ఒకరు, మనసులో ఇంకొకరు’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral) అవుతుంది. ఇలాంటి డబుల్ స్టాండర్డ్ డైలాగ్స్ వల్ల విజయం దక్కదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ మే 19న రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది నిహారిక.
Also Read: Revanth Vs Talasani: తలసానిపై రేవంత్ ఫైర్.. ఘాటైన పదజాలంతో కౌంటర్