Om Bheem Bush 3 Days worldwide Collections : 3 రోజులు 17 కోట్లు.. బ్లాక్ బస్టర్ దిశగా ఓం భీమ్ బుష్..!
Om Bheem Bush 3 Days worldwide Collections హుషారుతో డైరెక్టర్ గా తన మొదటి ప్రయత్నంతో మెప్పించిన డైరెక్టర్ హర్ష కొనుగంటి తన సెకండ్ అటెంప్ట్ గా చేసిన సినిమా ఓం భీం బుష్. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రిదర్శి లీడ్ రోల్స్
- By Ramesh Published Date - 04:45 PM, Mon - 25 March 24

Om Bheem Bush 3 Days worldwide Collections హుషారుతో డైరెక్టర్ గా తన మొదటి ప్రయత్నంతో మెప్పించిన డైరెక్టర్ హర్ష కొనుగంటి తన సెకండ్ అటెంప్ట్ గా చేసిన సినిమా ఓం భీం బుష్. శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రిదర్శి లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా ఫ్రై డే రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పోటీగా సినిమాలేవి లేకపోవడం సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచడంతో ఓం భీం బుష్ సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమా రిలీజ్ డే 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయంగా రెండో రోజు ఐదున్నర కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది.
రెండు రోజుల్లో 10 కోట్లు దాటిన ఈ సినిమా సండే దాదాపు 6 కోట్ల పైన వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ గా ఓం భీం బుష్ 3 రోజుల్లోనే ఏకంగా 17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లో బడ్జెట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం చూస్తుంటే ఓం భీం బుష్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు.
స్టార్ సినిమాల మాదిరిగా 3 రోజుల్లోనే భారీ వసూళ్లను సాధించిన ఓం భీం బుష్ రాబోయే రోజుల్లో మరింత స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టేలా కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్లకు మంచి ప్రాఫిట్స్ తెచ్చేలా ఉంది. శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకోగా ఆ సక్సెస్ మేనియా కొనసాగించేలా ఓం భీం బుష్ కూడా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తుంది.
Also Read : Tillu Square Runtime Shock : రెండు గంటల్లోపే టిల్లు స్క్వేర్.. సిద్ధు స్కెచ్ అదిరిందిగా..!