Pawan OG : ‘ఓజి’ నే ముందు వస్తుందా..?
Pawan OG : ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల అయితే, పవన్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద గిఫ్ట్ అవుతుంది
- Author : Sudheer
Date : 29-03-2025 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan) సినిమాల గురించి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన పొలిటికల్ కమిట్‌మెంట్స్ వల్ల సినిమాల షూటింగ్ ఆలస్యం అవుతున్నా, ఫ్యాన్స్ మాత్రం ముఖ్యంగా ‘ఓజి'(OG) కోసం వెయిట్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండటంతో పవన్ సమయం చాలా టైట్‌గా ఉన్నా, ఏప్రిల్-మేలో ఆయన అవసరమైన డేట్లు కేటాయించి షూటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్య కలిసి సెప్టెంబర్ రీలీజ్ సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నారు. ఇదే నిజమైతే ఈ యేడాదిలోనే థియేట్రికల్ రిలీజ్ కావొచ్చు.
TDP Formation Day : టీడీపీ ఆవిర్భవించి 43 ఏళ్లు.. పార్టీ చరిత్రలో కీలక ఘట్టాలివీ
ఓటిటి హక్కుల ఒప్పందం ప్రకారం ‘ఓజి’ 2024లోనే విడుదల చేయాల్సిన నిబంధన ఉంది. ఆలస్యం అయితే ఒప్పందంలో మార్పులు రావచ్చు, దీంతో సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూనిట్ ఫిక్స్ అయిపోయినట్టు సమాచారం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌కు సంబంధం లేని షూటింగ్ పార్ట్ పూర్తి కాగా, కొన్ని ముఖ్యమైన హీరో సన్నివేశాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పవన్ ఏప్రిల్, మేలో పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ‘ఓజి’ వస్తే.. మిగతా పెద్ద సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.
ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల అయితే, పవన్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద గిఫ్ట్ అవుతుంది. తక్కువ గ్యాప్‌లో రెండు సినిమాలను ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరికేలా ఉంది. ‘ఓజి’ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ ఉండగా, అది పూర్తి చేయడం పెద్ద పని కాదని అంటున్నారు. రీమేక్ కావడంతో దాన్ని త్వరగా పూర్తి చేసే స్కోప్ ఉంది. హరీష్ శంకర్ సిద్ధంగా ఉన్నా మొదటగా ‘ఓజి’ని పూర్తి చేయడమే టీమ్ ముందున్న ముఖ్యమైన టార్గెట్. మరి పవన్ సినిమా సెప్టెంబర్‌లోనే వస్తుందా లేక ఇంకాస్త ఆలస్యం అవుతుందా? వేచి చూడాలి!