OG Censor Talk : గూస్ బంప్స్ తెప్పిస్తున్న OG సెన్సార్ టాక్
OG Censor Talk : సాధారణంగా స్టార్ హీరో సినిమాలు 2.30 గంటల లోపు ఉండటం అరుదు. ఈ వ్యవధి వల్ల కథలోని అన్ని అంశాలను సమగ్రంగా చూపించడానికి అవకాశం ఉంటుందని, ప్రేక్షకులకు పూర్తి స్థాయి అనుభూతి కలిగించేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది
- By Sudheer Published Date - 08:52 PM, Mon - 22 September 25

‘ఓజీ’ (OG) సినిమా పై అభిమానుల్లో , సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ వివరాలు వెలువడడంతో అంచనాలు మరింత పెరిగాయి. సెన్సార్ బోర్డు (Censor) ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్’ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అనువుగా ఉంటుందన్నమాట. మూవీలో విపరీతమైన హింసాత్మక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎక్కువగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది దర్శకుడి శైలికి తగిన మాస్ టచ్ అని అభిమానులు భావిస్తున్నప్పటికీ, కుటుంబ ప్రేక్షకుల హాజరుపై ఈ సర్టిఫికెట్ ప్రభావం చూపే అవకాశముంది.
Cheapest Cars: దేశంలో అత్యంత చౌకైన కారు ఇదే.. ధర ఎంతంటే?
ఇకపోతే సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలు (154 నిమిషాలు 15 సెకన్లు) గా లాక్ చేశారు. సాధారణంగా స్టార్ హీరో సినిమాలు 2.30 గంటల లోపు ఉండటం అరుదు. ఈ వ్యవధి వల్ల కథలోని అన్ని అంశాలను సమగ్రంగా చూపించడానికి అవకాశం ఉంటుందని, ప్రేక్షకులకు పూర్తి స్థాయి అనుభూతి కలిగించేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, స్టోరీ టెల్లింగ్ అన్ని కోణాల్లో ప్రేక్షకులు సంతృప్తి చెందేలా కట్ చేసినట్లు సమాచారం. పవన్ స్టైల్ , యాక్షన్ అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలుత 25వ తేదీ ఉదయం 1 గంటకు స్పెషల్ షో అనుమతిని కోరగా, ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, 24వ తేదీ రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అభిమానులు ఒకరోజు ముందుగానే తమ అభిమాన హీరోను థియేటర్లలో చూసే అవకాశం పొందనున్నారు. ఈ నిర్ణయం టికెట్ విక్రయాలను, పాజిటివ్ బజ్‌ను పెంచుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 25న అధికారికంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే రికార్డు స్థాయి బుకింగ్స్ నమోదు చేస్తూ, టాలీవుడ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.