OG Collections : OG ఫస్ట్ డే రికార్డు బ్రేక్ కలెక్షన్స్
OG Collections : ట్రేడ్ వర్గాల ప్రకారం.. ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ రూ.90.25 కోట్లు సాధించడం విశేషం. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ.20.25 కోట్లు రాబట్టడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శనం అని చెప్పాలి
- By Sudheer Published Date - 08:57 AM, Fri - 26 September 25

పవన్ కళ్యాణ్ – సుజిత్ కలయికలో తెరకెక్కిన OG మూవీ వరల్డ్ వైడ్ గా Sep 25 న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. రిలీజ్ ముందు నుంచే పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్లలో సినిమా దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. ప్రీమియర్స్‌తో కలిపి ఇండియాలోనే నెట్ కలెక్షన్స్ రూ.90.25 కోట్లు సాధించడం విశేషం. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ.20.25 కోట్లు రాబట్టడం పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు నిదర్శనం అని చెప్పాలి.
Weight Loss: గ్రీన్ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?
అంతేకాకుండా “ఓజీ” తొలి రోజు ప్రేక్షకాదరణ కూడా విశేషంగా నిలిచింది. Sacnilk రిపోర్ట్స్ ప్రకారం, తెలుగులో 69.35% ఆక్యుపెన్సీ, తమిళ్‌లో 18.36% ఆక్యుపెన్సీ, హిందీ వెర్షన్‌లో 10.37% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇది రీజియనల్ భాషల్లోనూ పవన్ ప్రభావం ఎంత విస్తరించిందో స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు థియేటర్ల వద్ద జెర్సీలు ధరించి, బ్యానర్లు కట్టి, ఫ్లెక్సీలు వేసి పండుగ వాతావరణం సృష్టించారు. పవన్ గ్యాంగ్‌స్టర్ లుక్, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.
ఈ కలెక్షన్లతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆల్టైమ్ ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్‌గా నిలిచినందుకు ఇది ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. పవన్ కెరీర్‌లోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలోనూ “ఓజీ” ఫస్ట్ డే రికార్డులు కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఇకపై వీకెండ్ కలెక్షన్లలో సినిమా మరింత శక్తివంతంగా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ “ఓజీ”తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.