Weight Loss: గ్రీన్ టీ, మునగాకు టీ.. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఏది మంచిదో తెలుసా?
Weight Loss: బరువు తగ్గాలి అనుకున్న వారికి గ్రీన్ టీ అలాగే మునగాకు టీలలో ఏది మంచిది. దేని వల్ల ఎక్కువ ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Fri - 26 September 25

Weight Loss: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది డైట్లు ఫాలో అవ్వడం, జిమ్ లో ఎక్సర్సైజులు చేయడం వర్కౌట్ లు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉపవాసాలు ఉండడంతో పాటు ఒక పూట భోజనం చేయకుండా ఉండటం లాంటి నియమాలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మునగాకు టీ మరి కొంతమంది గ్రీన్ టీ కూడా బరువు తగ్గడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో, ఏది ఎక్కువ ఎఫెక్ట్ గా పని చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుందట. తద్వారా కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతున్నారు. రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల మన జీవక్రియ కూడా వేగవంతం అవుతుందట. ఇకపోతే మోరింగ టీని మోరింగ ఆకులు అనగా మునగ ఆకు నుండి తయారు చేస్తారు. మునగాకు టీలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి పోషణను అందిస్తుంది. గ్రీన్ టీలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కేవలం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ మునగాకు టీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
తరచుగా చిరుతిళ్లు, అతిగా తినడం నివారించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే ఈ టీలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుందట. తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటుందట. పేగులను శుభ్రంగా ఉంచడంలో, ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంలో మునగాకు టీ చాలా బాగా పని చేస్తుందని, ఇది కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే గ్రీన్ టీ కూడా కడుపుకు మంచిదే అయినప్పటికి ఇది ఖాళీ కడుపుతో తాగడం వల్ల కొంత చికాకు కలిగిస్తుంది. గ్రీన్ టీ లో థర్మోజెనిక్ ప్రభావం అంటే వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఫ్యాట్ బర్నింగ్ ను పెంచుతుందట.
దీనిలోని కెఫిన్, కాటెచిన్లు కొవ్వును కాల్చడాన్ని వేగవంతం చేస్తాయట. వ్యాయామంతో కలిపితే ఇది కేలరీలను వేగంగా బర్న్ చేయడంలో సహాయపడుతుందట. ఫలితాలు కూడా వేగంగా కనిపిస్తాయట. మోరింగా టీ ప్రభావం కొంచెం నెమ్మదిగా ఉంటుందని చెబుతున్నారు. వేగంగా బరువు తగ్గాలనుకుంటే, కెఫిన్ తో సమస్యలు లేకపోతే, గ్రీన్ టీ ప్రభావవంతంగా ఉంటుంది. సహజమైన, పోషకాలు అధికంగా ఉండే, కెఫిన్ లేని టీ కావాలనుకుంటే మునగాకు టీ మంచిది. మునగ టీ తాగడం వల్ల బరువు నెమ్మదిగా క్రమంగా తగ్గవచ్చు. కానీ, గ్రీన్ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడం కనిపిస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి గ్రీన్ టీ ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.